News March 24, 2024

HYD: కడుపు కోసి.. దారుణంగా చంపాడు..!

image

HYD బాలానగర్‌లో <<12918850>>యువకుడు ప్రణీత్ తేజ<<>> (20)ను స్నేహితుడే చంపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మద్యం తాగుదామని తీసుకెళ్లిన స్నేహితుడు.. ప్రణీత్‌ మత్తులోకి జారుకున్నాక మెడ, కడుపు కోసి చంపేశాడు. అనంతరం సైకో లాగా కడుపులోని పేగులను బయటకు తీశాడు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Similar News

News February 24, 2026

HYD: షాకింగ్! 13ఏళ్ల బాలికకు గుండెపోటు

image

వయసుతో సంబంధంలేకుండా నమోదవుతున్న గుండెపోటు మరణాలు వేధిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి మంచాలలోనూ సోమవారం ఓ పసి గుండె ఆగింది. స్థానికుల వివరాలిలా.. ఆగపల్లి గ్రామస్థుడు లకుమళ్ల యాదవరావు కూతురు నిహారిక(13) ఛాతిలో నెప్పితో తల్లడిల్లుతుంటే నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. చిన్న వయసులో హాట్‌ఎటాక్‌తో మరణించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

News February 24, 2026

HYDలో ఇసుక బజార్ల ఏర్పాటుకు చర్యలు

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇసుక బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి ప్రభుత్వం కొత్తగా ఇసుక బజార్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 4 ఇసుక బజార్లు ప్రారంభించబడ్డాయి. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో మే నాటికి 6 కొత్త ఇసుక బజార్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇసుకను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి సహాయపడతాయి.

News February 24, 2026

HYD: గాంధీ విగ్రహం వద్దని గాంధీ మునిమనవడి ట్వీట్

image

మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహం కోసం ప్రజలను తరలించడం అత్యంత అగాంధేయ చర్య అని గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అన్నారు. ఇళ్లను కూల్చి స్థలం కల్పించడం గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బాపు ఉండి ఉంటే ‘నా పేరుతో ఇలాంటి పనులు చేయొద్దు’ అని చెప్పేవారని తుషార్ గాంధీ Xలో ట్వీట్ చేశారు.