News December 1, 2025
HYD: కరెంటు బిల్లే క్రెడిట్ స్కోరు.!

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణను ప్రకటించనుంది. ‘రుణ చరిత్ర లేని’ ప్రజల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB) ఏర్పాటు కానుంది. ఈ సంస్థ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు వంటి చెల్లింపుల రికార్డులను పరిశీలించి ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా బ్యాంకులు లక్షలాది మందికి రుణాలు అందించే అవకాశం ఉందని అధికారులు Way2Newsకు తెలిపారు.
Similar News
News December 1, 2025
ప.గో.: పోలీస్ శాఖ PGRSకు 13 అర్జీలు

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 13 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి, సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
News December 1, 2025
ఎయిర్‌పోర్టుల్లో GPS స్పూఫింగ్ జరిగింది: కేంద్రం

ఇటీవల ఢిల్లీలో విమాన సర్వీసుల రద్దుకు GPS స్పూఫింగ్ కారణమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. HYD, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, అమృత్‌సర్, చెన్నైలకూ ఫేక్ సిగ్నల్స్ వచ్చాయన్నారు. శాటిలైట్ నావిగేషన్‌లో ఇలా జరగడంతో వెంటనే గ్రౌండ్ నావిగేషన్, సర్వైలెన్స్ యాక్టివేట్ చేశామని MP నిరంజన్ రెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో ఇవాళ సమాధానం ఇచ్చారు. ఈ సిగ్నల్స్ సోర్స్ గుర్తించే పనిలో కేంద్రం ఉందన్నారు.
News December 1, 2025
అయిజ: “Way2News ఎఫెక్ట్” ఎట్టకేలకు నామినేషన్ దాఖలు

అయిజ మండలం ఉత్తనూర్ సర్పంచ్ స్థానానికి హాలియా దాసరి జయమ్మ నామినేషన్ వేసే ప్రయత్నం చేయగా అదే సామాజిక వర్గానికి చెందిన వారు బెదిరింపులకు గురి చేశారు. ఈ విషయమై Way2News లో సోమవారం ఉదయం “ఉత్తనూరులో హాలియా దాసర్లకు బెదిరింపులు” శీర్షికన కథనం ప్రచురితమైంది. కథనానికి మండల అధికారులు స్పందించి గ్రామానికి చేరుకున్నారు. వారిని కలిసి సాయంత్రం నామినేషన్ వేయించారు. వే2న్యూస్‌కు గ్రామస్థులు అభినందించారు.


