News August 13, 2025

HYD: క‌లుషిత నీరు, సీవ‌రేజి స‌మ‌స్య‌ల‌పై స్పెషల్ ఫోకస్

image

HYDలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ క‌లుషిత నీరు, సీవ‌రేజి స‌మ‌స్య‌ల‌పై జలమండలి ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. వ‌ర్షాల నేప‌థ్యంలో సీవ‌రేజి ఓవర్‌ఫ్లో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌ను ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్‌ఎం‌సీ, హైడ్రా గుర్తించిన 141 నీరు నిలిచే హాట్‌ స్పాట్లను పర్యవేక్షించాలని, మ్యాన్‌హోళ్లు ఉప్పొంగితే వెంట‌నే పూడిక‌తీత ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు.

Similar News

News August 31, 2025

HYD: లడ్డూ దొంగలొస్తున్నారు.. జాగ్రత్త!

image

వినాయకచవితి నవరాత్రుల వేళ లడ్డూ దొంగల బెడద పెరిగింది. మీర్‌పేట PS పరిధి హస్తినాపురంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీర్స్‌ కాలనీలో ఏకంగా 4 మండపాల్లో గణపతి లడ్డూలను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి స్కూటీపై వచ్చిన యువకులు అదును చూసి చోరీ చేశారు. దీనిపై స్థానికులు PSలో ఫిర్యాదు చేశారు. మండపంలో నిద్రించే వాలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT

News August 30, 2025

HYDలో ఫంక్షన్ కోసం పేదోడి టెన్షన్!

image

ఇంట్లో ఫంక్షన్‌ ఉంటే HYDలో పేదోడు ఓ ఫంక్షన్ చేయాలంటే కొండంత భారంగా మారింది. ఇందుకోసం అప్పు మీద అప్పు చేయాల్సిన పరిస్థితి. HYDలో ఒక ఫంక్షన్ కోసం రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువుకు వలస వచ్చిన ఎంతో మంది ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. HYDలో ప్రభుత్వం ప్రతి డివిజన్‌లో కనీసం 2 ఫంక్షన్ హాల్స్ నిర్మించి, తక్కువ ధరకు ఉంచేలా చూడాలని కోరుతున్నారు.

News August 30, 2025

మహానగరంలో శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు

image

వచ్చే నెల 6న జరిగే గణపతి శోభాయాత్రకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. స్టాటిక్ క్రేన్లు: 134, మొబైల్ క్రేన్లు: 269, హుస్సేన్‌సాగర్ వద్ద పడవలు 9, డీఆర్ఎఫ్ 16 టీములు, గజ ఈతగాళ్లు: 200, గణేశ్ యాక్షన్ టీమ్స్: 160, పారిశుద్ధ్య కార్మికులు 14,486 మంది, మినీ టిప్పర్లు: 102, జేసీబీలు 125, స్వీపింగ్ యంత్రాలు 30, మొబైల్ టాయిలెట్స్ 309, లైటింగ్ పాయింట్లు 56,187, వైద్య శిబిరాలు 7 ఏర్పాటు చేశారు.