News November 1, 2024

HYD: కల్తీ పాలను ఇలా గుర్తించండి..!

image

HYD నగరంలో కల్తీ మహమ్మారి ప్రజలను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిషన్, FSSAI అధికారులు కల్తీ పాలను గుర్తించే విధానాన్ని వివరించారు.చల్లార్చిన పాలలో 2-3 చుక్కల అయోడిన్ టింక్చర్ కలపాలి. కాసేపటి తర్వాత పాలు నీలిరంగు కలర్‌లో మారితే కల్తీ జరిగినట్లని గుర్తించాలి. పన్నీర్ లాంటి ఇతర పాల ఉత్పత్తుల టెస్టింగ్లో 2-3ML శాంపిల్లో 5ML నీటిని కలిపి కాచి చల్లార్చి, 2-3 చుక్కల అయోడిన్ టింక్చర్ కలపాలన్నారు.

Similar News

News September 19, 2025

దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో గెలిచి చూపించు KTR: మంత్రి

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓ వైపు అధికార పార్టీ, మరో వైపు ప్రతిపక్ష పార్టీ నువ్వానేనా అన్నచందంగా మాటల తూటాలు పేలుస్తున్నాయి. తాజాగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ‘KTR నువ్వో పిల్లబచ్చా..అసెంబ్లీ ఎన్నికల్లో కాదు దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో గెలిచి చూపించు..అప్పటికి నువ్వు ఇండియాలో ఉంటవో విదేశాలకు చెక్కేస్తవో’అని అన్నారు. నోటిదూల KTRకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని Tకాంగ్రెస్ Xలో ట్వీట్ చేసింది.

News September 19, 2025

HYD: హైకోర్టును ఆశ్రయించిన హరీశ్‌రావు

image

BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు తనపై నమోదైన 3 వేర్వేరు క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ HYDలోని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను, ఆలయ ఈవోను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.

News September 19, 2025

HYD: రూ.3కోట్ల బంగారం.. అలా వదిలేశారు

image

గత నెల 22న శంషాబాద్ విమానాశ్రయంలో 2 లగేజీ బ్యాగులు అలాగే ఉండిపోయాయి. వాటిని ఎవరూ తీసుకెళ్లలేదు. సిబ్బంది పరిశీలించగా బంగారం కనిపించింది. 3379.600 గ్రాముల బరువు ఉంటుంది. దీని విలువ రూ.3.36 కోట్లుగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కడపకు చెందిన ఇద్దరు వ్యక్తలు కువైట్‌ నుంచి తెచ్చినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.