News July 9, 2025

HYD: క‌ల్లు డిపోల లైసెన్స్ ర‌ద్దు చేస్తాం: మంత్రి

image

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు, క‌ల్లు డిపోల లైసెన్స్ ర‌ద్దు చేస్తాం. భ‌విష్య‌త్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా క‌ట్టుదిట్ట‌మైన‌ చ‌ర్య‌లు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.

Similar News

News July 9, 2025

ఘట్కేసర్ వాసుకి ఉత్కృష్ట సేవా పథకం

image

కేంద్ర ప్రభుత్వ ఉత్కృష్ట సేవా పతకం ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన గుండ్యా నాయక్‌ను వరించింది. విధి నిర్వహణలో 15 ఏళ్ల పాటు సేవ, అంకితభావంతో వృత్తి పరమైన నైపుణ్యంతో అనేక విజయాలు సాధించిన ఆయనను ఉత్కృష్ట సేవా పతకం 2025 వరించింది. ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.

News July 9, 2025

పార్వతీపురం: 15 నుంచి పారిశుధ్య పక్షోత్సవాలు

image

పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ఈనెల 15 నుంచి ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జూలై 15 నుంచి 30వ తేదీ వరకు పక్షోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు.

News July 9, 2025

HCA, SRH మధ్య వివాదం ఏంటంటే?

image

IPL-2025 సందర్భంగా HCA, SRH మధ్య టికెట్ల వివాదం తలెత్తింది. రెగ్యులర్‌గా HCAకు 10% టికెట్లు ఫ్రీగా ఇస్తుండగా తనకు వ్యక్తిగతంగా మరో 10% టికెట్లు కావాలని HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ డిమాండ్ చేసినట్లు SRH ఆరోపించింది. అందుకు ఒప్పుకోకపోవడంతో LSGతో మ్యాచ్ సందర్భంగా VIP గ్యాలరీలకు తాళం వేసి జగన్మోహన్ వేధించారని ఫిర్యాదు చేసింది. విజిలెన్స్ విచారణలో ఇది నిజమని తేలడంతో జగన్మోహన్‌ను CID <<17008940>>అరెస్ట్<<>> చేసింది.