News January 24, 2026

HYD: కళల కాణాచి.. రవీంద్రభారతి!

image

రవీంద్రభారతి చుట్టూ ట్రాఫిక్ హారన్‌ల గోల మధ్యనూ సంగీత సౌరభాలను ప్రశాంతంగా పరిమళింపజేస్తోంది. సాహిత్య కుసుమాలు, నాట్య మయూరాలను పట్నానికి పరిచయం చేస్తోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ శతాబ్ది సందర్భంగా 1960 మార్చి 23న శంకుస్థాపన చేశారు. సర్వేపల్లి చేతుల మీదుగా 1961 మే 11న ప్రారంభించారు. మోహమ్మద్ ఫయాజుద్దీన్ డిజైన్ చేశారు. 1989 నుంచి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖే నిర్వహణ చూస్తోంది. హైదరాబాద్‌కు షాన్ అయింది.

Similar News

News February 19, 2026

HYD: నెల రోజులు రెక్కీ చేసి.. దారుణ హత్య

image

వనస్థలిపురం PS పరిధిలో వివాహిత హత్య జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్ తెలిపారు. BNరెడ్డి కప్పలచెరువు వద్ద గ్రీన్ సిటీ కాలనీలో ఉండే సునీత(30)కు 2022లో నిందితుడు మహేశ్(30)తో వివాహమైంది. గొడవల వల్ల 2024లో విడాకులు తీసుకుని 2025 ఏప్రిల్‌లో శ్రీనాథ్‌ను రెండో వివాహం చేసుకుందన్న కోపంతో నెల నుంచి రెక్కి నిర్వహించి బుధవారం పథకం ప్రకారం చంపేశాడని సీఐ తెలిపారు.

News February 19, 2026

HYD- విజయవాడ జస్ట్ 2.5 Hrs: మంత్రి!

image

రాష్ట్ర రోడ్ల నెట్‌వర్క్ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి, RRR, NH-65 (8 లేన్ల విస్తరణ) ప్రాజెక్టులే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఈ పనులు పూర్తైతే HYDకు విజయవాడ 2.5 గంటల్లో వెళ్లేలా చేరువకానుంది. హ్యామ్ (HAM) విధానంలో అద్దంలాంటి రోడ్ల నిర్మాణమే ధ్యేయమని, కేంద్ర నిధుల రాకపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.