News July 9, 2025
HYD: కళ్లద్దాలు వచ్చాయా? ఆధార్ అప్డేట్ చేయండి!

గతంలో సైట్ లేక, ఇటివలే కంటికి సైట్ వచ్చి, కళ్లద్దాలు పెట్టుకున్న వారి ఆధార్ బయోమెట్రిక్ వివరాలు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. HYDలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సహా పలు పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ సమస్య ఏర్పడుతోంది. దీంతో బయోమెట్రిక్ అప్డేషన్ కోసం సెంటర్ల వద్ద విద్యార్థులు క్యూ లైన్లు కడుతున్నారు. ఐరిస్ మార్పుల కారణంగా ఇలా అయి ఉండొచ్చని, అప్పుడప్పుడు అప్డేషన్ అవసరమన్నారు.
Similar News
News July 9, 2025
వైసీపీ MLAలు ఈసారైనా అసెంబ్లీకి వస్తారా?

AP: ఆగస్టులో <<17004691>>అసెంబ్లీ<<>> వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అయితే, ఈసారైనా YCP MLAలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. తమను ప్రతిపక్షంగా గుర్తించి, మాట్లాడటానికి ఎక్కువ సమయం ఇవ్వాలని YCP డిమాండ్ చేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈసారి వైసీపీ నేతలు సభకు వస్తారని మీరు అనుకుంటున్నారా?
News July 9, 2025
ఏలూరు: ‘రీసర్వే పనులను వేగవంతం చేయాలి’

జిల్లాలో రీసర్వే పనులను వేగవంతం చేయాలనీ జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం అధికారులతో సమీక్షించారు. జిల్లాలో రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన గ్రామాలలో, రెండవ దశలో రీసర్వే పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. అర్హులైన కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు అందజేయాలన్నారు.
News July 9, 2025
మెదక్: మిగిలిన సీట్లకు లాటరీ తీసిన కలెక్టర్

మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పథకంలో మిగిలిన సీట్లకు లాటరీ ప్రక్రియ ద్వారా సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో బెస్ట్ అవైలబుల్ స్కీం నందు మిగిలిన సీట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.