News February 15, 2025

HYD: కళ్లు చెదిరేలా ఆటో డ్రైవర్ కొడుకు ఆర్ట్స్

image

HYD నగరానికి చెందిన రాజేష్ నాయక్ అద్భుత ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆర్టిస్ట్ రాజేష్ నాయక్ ఆటో డ్రైవర్ కొడుకు కావడం గర్వంగా ఉందన్నారు. ఆటోలు నడపడం ఎంత ఇష్టమో, వాటిని తన ఇతివృత్తంగా చేసుకోవడం కూడా అంతే ఇష్టం అని తెలిపారు. ఈ ఆర్ట్ వర్క్స్ సృష్టించడానికి రెక్జిన్, మెటల్ మొదలైన వాటిని ఉపయోగించినట్లు తెలిపారు. X వేదికగా హైదరాబాద్ ప్రముఖ జర్నలిస్ట్ రాజేశ్వరి అతడిని అభినందించారు.

Similar News

News November 9, 2025

HNK: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సర్వం సిద్ధం

image

హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ రేపటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ర్యాలీ సజావుగా జరిగేందుకు హన్మకొండ ఏసీపీ నర్సింహ రావు, ఇన్‌స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రిక్రూట్మెంట్ జరిగే ప్రదేశాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకోవడం పాటు.. పరిసరాలపై నిఘా పెట్టారు.

News November 9, 2025

ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో చూడండి: రేవంత్

image

TG: BRS పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని CM రేవంత్ మండిపడ్డారు. ‘ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎవరో పెద్దోళ్లు తీసుకుంటారనుకునేది. ఇప్పుడు గల్లీగల్లీకి విస్తరించారు. అందుకే ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో, ఎవరిది పబ్ కల్చరో.. ఎవరిది సామాన్యులతో కలిసిపోయే కల్చరో చూడండి. సినీ కార్మికులతో ఎవరు మాట్లాడుతున్నారో.. సినీ తారలతో ఫామ్‌హౌస్‌లో ఎవరు ఉంటున్నారో గుర్తు చేసుకోవాలి’ అని కోరారు.

News November 9, 2025

భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచస్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదివారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ మైదానంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను జేసీ మ‌యూర్ అశోక్‌తో క‌లిసి ప‌రిశీలించి పలు సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజ‌ర‌వుతార‌న్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.