News May 4, 2024

HYD: కాంగ్రెసోళ్లు నన్ను ఓడించాలని చూస్తున్నారు: నివేదిత

image

కాంగ్రెసోళ్లు తనపై కక్ష కట్టి ఓడించాలని చూస్తున్నారని BRS సికింద్రాబాద్ కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదిత అన్నారు. HYD బోయిన్‌పల్లిలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోని కొంత మంది ముఖ్య నాయకులు కంటోన్మెంట్‌కి వచ్చి తనను ఓడించాలని శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ‘మా నాన్న చేయి.. నా తలమీద లేనప్పుడు నన్ను ఇబ్బందులు పెడుతున్న వారికి నా కంటోన్మెంట్ ప్రజలే బుద్ధి చెబుతారు’ అని అన్నారు.

Similar News

News October 31, 2025

HYD: అజ్జూ భాయ్ చుట్టూ పొలిటికల్ డ్రామా

image

ఇపుడు చర్చ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంపై కాకుండా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ చుట్టూ సాగుతోంది. కారణం ఆయనకు కాంగ్రెస్ మంత్రి పదవి ఇస్తుండటం వల్లే. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అతడికి మంత్రి పదవి ఎలా ఇస్తారని బీజేపీ నాయకులు, ఆయన దేశానికి చేసిన సేవను బీజేపీ గుర్తించడం లేదని కాంగ్రెస్ నేతలు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగారు.

News October 31, 2025

మాగంటి సునీతపై బోరబండ PSలో కేసు నమోదు

image

బీఆర్ఎస్ గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్‌మోహన్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్‌కు ఫిర్యాదు చేశారు. సునితపై ఇచ్చిన ఆధారాలను గుర్తించిన రిటర్నింగ్ అధికారి బోరబండ PSలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 31, 2025

HYD: ‘రన్ ఫర్ యూనిటీ’లో సీపీ, చిరంజీవి

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసుల శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్, నటుడు చిరంజీవి పాల్గొన్నారు. ఐక్యతకు మారుపేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వారు గుర్తు చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు, ఔత్సహికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.