News April 5, 2024

HYD: కాంగ్రెస్ జన జాతర సభను విజయవంతం చేయండి: ఎంపీ

image

కాంగ్రెస్​ పార్టీ.. చేవెళ్ల పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడలో శనివారం నిర్వహించ తలపెట్టిన జన జాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంపీ డాక్టర్​ జి.రంజిత్​ రెడ్డి పిలుపునిచ్చారు. హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ మేరకు శుక్రవారం ఆయన సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అగ్రనాయకత్వం ఈ సభ ద్వారా విడుదల చేస్తుందని అన్నారు.

Similar News

News October 31, 2025

HYD: అజహరుద్దీన్ ప్రస్థానం ఇదే!

image

రాజ్ భవన్‌లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్‌లో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.

News October 31, 2025

HYD: ‘3 నెలల క్రితమే మంత్రి పదవిపై నిర్ణయం’

image

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అజార్‌పై ఉన్న కేసుల గురించి స్పష్టంగా చెప్పాలంటే కిషన్‌రెడ్డి ముందుకు రావాలని సవాల్ విసిరారు. 3 నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవిపై నిర్ణయం తీసుకున్నామని, దీంతో మైనారిటీలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

News October 31, 2025

HYD సంస్థానం గురించి తెలుసా?

image

ప్రపంచప్రఖ్యాత HYD సంస్థానాన్ని 16 జిల్లాలుగా విభజించారు. తెలంగాణ 8, మరాఠ 5, కన్నడ 3 జిల్లాలుగా విస్తరించారు. అనేక రాజవంశాల పాలనలో సుసంపన్నమైన ఈ సంస్థానాన్ని 1724లో మీర్ కమర్-ఉద్-దిన్ ఖాన్ సిద్దిఖీ అసఫ్‌జాహీ వంశాన్ని స్థాపించి 224 ఏళ్లు పరిపాలించారు. కాలక్రమంలో వీరి అరాచకాలు ఢిల్లీకి చేరాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ బలగాలతో ఇక్కడికి వచ్చి సంస్థానాన్ని భారతమాత ఒడిలో విలీనం చేశారు.