News September 20, 2025

HYD: కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేదు: బీజేపీ స్టేట్ చీఫ్

image

తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ సమస్యపై HYDలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈరోజు మాట్లాడారు. 2020లో BRS ప్రభుత్వం తెచ్చిన G.O.68 చిన్న హోర్డింగ్ ఏజెన్సీలను కూలదోసిందని ఆరోపించారు. 3 పెద్ద ఏజెన్సీలకు మాత్రమే లాభం చేకూర్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కుటుంబాల జీవనోపాధి దెబ్బతిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల తర్వాత కూడా హామీ నిలబెట్టలేదని విమర్శించారు.

Similar News

News September 20, 2025

విశాఖ కలెక్టరేట్లో ఉచిత వైద్య శిబిరం

image

విశాఖ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని ఆయన చేతుల మీదుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 147 మంది సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News September 20, 2025

విశాఖ: 3రోజుల్లో 1,759 ఆక్రమణల తొలగింపు

image

విశాఖ ఆపరేషన్ లంగ్స్ 2.0 కింద 3 రోజుల్లో 1,759 ఆక్రమణలు తొలగించినట్లు సిటీ చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకరరావు ప్రకటించారు. తగరపువలస, భీమిలి-51, శ్రీకాంత్‌నగర్, అంబేద్కర్ జంక్షన్-70, గురుద్వారా, పోర్ట్ స్టేడియం-60, అంబేద్కర్ సర్కిల్, జైలు రోడ్డు-195, ఊర్వశి జంక్షన్-35, గాజువాక, వడ్లపూడి-204, నెహ్రూచౌక్-26, వేపగుంట, గోశాల జంక్షన్, సింహాచలం ద్వారం పరిధిలో 65 ఆక్రమణలు తొలగించారు.

News September 20, 2025

క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

image

తూ.గో జిల్లా యువ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ కప్ – 2025లో సాధించిన విజయంపై కలెక్టర్ కీర్తి చేకూరి అభినందనలు తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో క్రీడాకారులు కలెక్టర్‌ను కలుసుకొని, తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు గౌరవం తీసుకొచ్చిన మీరంతా ఇతరులకు ఆదర్శం, మీ కృషి ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.