News November 5, 2025
HYD: కార్తీకపౌర్ణమి.. ఫేమస్ శివాలయాలు ఇవే!

కార్తీక పౌర్ణమి సందర్భంగా HYD-ఉమ్మడి రంగారెడ్డిలోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. కీసరగుట్టతో పాటు సిటీ శివారులో ప్రఖ్యాతి, అతి పురాతన ఆలయాలు ఉన్నాయి. ఆరుట్ల-బుగ్గ రామలింగేశ్వర స్వామి, యాచారం-నందీశ్వర, శంషాబాద్-సిద్ధేశ్వరాలయం, శంకర్‌పల్లి-మరకత శివలింగం, పాంబండ-రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. పాంబండ దక్షిణాసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతంపైన ఉన్న ఆలయం. మీ ఏరియాలోని శివాలయం విశిష్టత ఏంటి?
SHARE IT
Similar News
News November 5, 2025
APSRTCలో 277 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<
News November 5, 2025
గొల్లప్రోలు: మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి జైలు శిక్ష

గొల్లప్రోలుకు చెందిన మచ్చ రామ్మోహన్‌కు పోక్సో కోర్టు జడ్జి కె. శ్రీదేవి జైలు శిక్ష, జరిమానా విధించారు. 2017లో 17 ఏళ్ల అమ్మాయిని కళాశాల నుంచి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటనపై నమోదు అయిన కేసులో 8 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారని సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. వాదనలు, ప్రతివాదనల అనంతరం న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.
News November 5, 2025
పెద్దూరులో అత్యధిక వర్షపాతం నమోదు

నాగర్‌కర్నూల్ జిల్లాలో గడచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా తెలకపల్లి మండలం పెద్దూరులో 69.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్మెర 57.3, వెల్దండ 41.8, కల్వకుర్తి, యంగంపల్లి 40.0, బొల్లంపల్లి 39.0, ఊర్కొండ 33.3, ఉప్పునుంతల 30.8, పెద్దకొత్తపల్లి 20.0, తెలకపల్లి 19.3, వంకేశ్వర్ 14.0, లింగాల 9.8, మంగనూరులో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.


