News January 11, 2026
HYD: కార్పొరేషన్ కోసం లష్కర్‌లో లడాయి

GHMCని 3గా విభజించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ లేదా లష్కర్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడుతోంది. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ను విస్మరించడం తగదని స్థానికులు, BRS నేతలు మండిపడుతున్నారు. HYD- సికింద్రాబాద్ జంట నగరాలుగా పేరొందగా, సికింద్రాబాద్ పేరు లేకుండా పునర్వ్యవస్థీకరణ సరికాదంటున్నారు. సర్కార్ దిగొచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేలా ఉద్యమం ఉద్ధృతం అయింది.
Similar News
News February 13, 2026
BREAKING: మధిర మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకా మధిర మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ సాధించింది. ఇక్కడ మొత్తం 22 వార్డులకు గాను 14 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 1 వార్డు BRS, 1 వార్డు ఇతరులు గెలిచారు. మిగితా వార్డుల్లో కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News February 13, 2026
కొడంగల్ కాంగ్రెస్ దే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం 12 మున్సిపల్ వార్డులకు గాను 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రతిపక్ష BRS, MIM పార్టీలు తలో ఒక స్థానానికే పరిమితమయ్యాయి. సొంత గడ్డపై రేవంత్ రెడ్డి పట్టు నిరూపించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
News February 13, 2026
మెదక్: మున్సిపల్.. భార్యాభర్తలు గెలుపు

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో భార్యాభర్తలు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు నుంచి పోటీ చేసిన గజవాడ లావణ్య 281 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఆమె భర్త గజవాడ నాగరాజు 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 186 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. దీంతో భార్యాభర్తలు ఘనవిజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు.


