News August 25, 2025
HYD: కార్యకర్తలతో సెల్ఫీ దిగిన KTR

శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్ కార్యకర్తలతో ఆత్మీయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమావేశమయ్యారు. తమ అభిమాన నాయకుడిని చూసిన కార్యకర్తలు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో కేటీఆర్ స్వయంగా వారితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్టీలో కొందరు ప్రధాన నేతలు మోసం చేసినా.. కార్యకర్తలు పార్టీని గుండెల్లో పెట్టుకుని చేసుకుంటున్నారని వారిని కీర్తించారు.
Similar News
News August 25, 2025
గణేశ్ నిమజ్జనానికి GHMC భారీ ఏర్పాట్లు

హుస్సేన్‌సాగర్‌తో సహా HYDలోని 66 చెరువులు, కుంటల్లో GHMC నిమజ్జనానికి ఏర్పాట్లు చేసింది. 41 కృత్రిమ పాయింట్లను ఏర్పాటు చేసింది. 3.10 లక్షల మట్టి గణేశ్ విగ్రహాలు పంపిణీ చేయనుంది. నిమజ్జనానికి 140 స్టాటిక్, 295 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు, 14,486 పారిశుద్ధ్య కార్మికులు రంగంలోకి దిగనున్నారు. 13 కంట్రోల్ రూములు, 309 మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
News August 25, 2025
నగరంలో లాగింగ్ పాయింట్లు 3 రెట్లు పెరిగాయి

నగరంలో వర్షం వస్తే బయటకు వెళ్లాలంటేనే భయం. కారణం వాటర్ లాగింగ్ పాయింట్లు HYDలో పెరగడం గతంలో వాటర్ లాగింగ్ పాయింట్లు 144 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 436కు పెరిగినట్లు తేలింది. దీంతో అధికారుల్లో ఒక రకమైన ఆందోళన, అన్ని చోట్లా నీరు నిలిచిపోతే నగరం ఏమైపోతుందన్న భయం.. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల సర్వేలో ఈ వివరాలు తెలిశాయని సమాచారం.
News August 25, 2025
దేశంలోనే TG హైకోర్టు టాప్.. 9వ స్థానంలో ఏపీ

మహిళా న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. 33.3% మహిళా జడ్జీలు ఇక్కడ సేవలందిస్తున్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం 30 మంది జడ్జీలు ఉండగా 10 మంది అంటే 33.3% మంది మహిళా జడ్జిలు ఉన్నారు. అదే ఏపీలో 30 మందికి గానూ 16.67 % అంటే ఐదుగురే ఉండటంతో జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసర్చ్ నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.