News July 7, 2025
HYD: కాలుకు సర్జరీ.. గుండెపోటుతో బాలుడి మృతి

కాలుకు సర్జరీ చేసిన అనంతరం గుండెపోటు రావడంతో 7 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఘటన HYDలో వెలుగుచూసింది. కాలులో చీమును తొలగించేందుకు బాలుడిని తల్లిదండ్రులు బంజారాహిల్స్ రోడ్ నంబర్.12లోని టీఎక్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో గుండెపోటు రావడంతో బాలుడు మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ కుమారుడి ప్రాణాలు పోయాయని తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
Similar News
News July 7, 2025
ఈ నెల 14-16 వరకు సీఎం ఢిల్లీ పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 14-16వరకు ఢిల్లీలో పర్యటించనున్నారు. 14న సాయంత్రం ఆయన హస్తినకు బయల్దేరనున్నారు. కేంద్ర హోం, ఆర్థిక, జలశక్తి శాఖల మంత్రులను సీఎం కలవనున్నారు. ఇతర శాఖల మంత్రులనూ కలుస్తారని సమాచారం.
News July 7, 2025
విశాఖ: పోలీస్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందజేత

ఆర్కే బీచ్ వద్ద పోలీస్ విభాగానికి వివిధ సంస్థలు, ప్రభుత్వం సమకూర్చిన ఏసీ హెల్మెట్లు, టూవీలర్స్, ఇతర సామగ్రిని హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం అందజేశారు. పోలీస్ సిబ్బందికి మౌలిక వసతులు అందిస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ఆమె అన్నారు. దాదాపు రూ.70 లక్షలతో 20 హెల్మెట్లు, 64 ద్విచక్ర వాహనాలు, రెండు కెమెరాలు అందజేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
News July 7, 2025
జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేసీ

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ సోమవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 44,792 మెట్రిక్ టన్నుల ఎరువులు ప్రైవేటు, ఏపీ మార్కెట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులకు కావలసిన మొత్తం ఎరువులు లభ్యంగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ రాహుల్ స్పష్టం చేశారు.