News August 26, 2025

HYD: కాలేజీ యాజమాన్యాలపై HRC సీరియస్

image

సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీ యాజమాన్యాలపై హెచ్ఆర్‌సీ సీరియస్ అయ్యింది. స్కాలర్‌షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్ రాలేదని విద్యార్థుల టీసీ నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలానగర్‌లోని గౌతమీ డిగ్రీ కళాశాల, బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఫార్మసీ కాలేజీపై చర్యలకు సిద్ధమైంది. కాలేజీ ఛైర్మన్, ప్రిన్సిపల్ 28న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News August 26, 2025

అంబేడ్కర్ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి:

image

అనంతపురం జిల్లాలో అంబేడ్కర్ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మధు ప్రసాద్ ఏపీ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్‌ను కలిసి మంగళవారం వినతిపత్రం అందించారు. మధు మాట్లాడుతూ.. జిల్లాలో గురుకుల కళాశాల ఏర్పాటు, వంట వర్కర్ల జీతాలు, టెండర్ల విషయం, గురుకుల పాఠశాలలో సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. జేఏసీ నాయకులు చిరంజీవి, వెంకి, నాగరాజు పాల్గొన్నారు.

News August 26, 2025

బార్ లైసెన్స్ అప్లికేషన్లు.. 29 వరకు ఛాన్స్

image

AP: బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువును ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. వినాయక చవితి, బ్యాంకు సెలవుల దృష్ట్యా గడువు పొడిగించినట్లు తెలిపింది. గడువు పెంపుపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. బార్ లైసెన్సులకు ఈ నెల 30న ఉ. 8 గం.కు లాటరీ తీయనున్నారు. కాగా బార్లకు ఇచ్చే మద్యంపై పన్ను, ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు తప్పనిసరనే నిబంధనలతో తక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం.

News August 26, 2025

ప్రతి పాఠశాలలో స్కౌట్ యూనిట్ తప్పనిసరి: DEO

image

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్కౌట్ యూనిట్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని DEO సుబ్రహ్మణ్యం సూచించారు. రాయచోటిలోని డైట్ నందు మంగళవారం పాఠశాలల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, యూనిట్ లీడర్లకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని 39 పీఎం పాఠశాలల్లో స్కౌట్ కార్యకలాపాల కోసం సమగ్ర శిక్ష ద్వారా కేటాయించిన రూ.50 వేలను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలన్నారు.