News October 6, 2025
HYD: కాసేపట్లో ఇంటికి.. ఇంతలోనే యాక్సిడెంట్

ఫోన్ పోయిందని మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా దంపతులను వెనుక నుంచి కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మేడ్చల్ ITI కళాశాల ముందు జాతీయ రహదారి-44పై జరిగిన ఈ ఘటనలో కళావతి(35) తలపై నుంచి లారీ దూసుకెళ్లిందన్నారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News October 7, 2025
HYD: హైడ్రాను అభినందించిన హైకోర్టు

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి సోమవారం ప్రశంసలు కురిపించారు. నగరంలో చెరువుల పునరుద్ధరణకు హైడ్రా యజ్ఞంలా పని చేస్తోందని అభినందించారు. బతుకమ్మకుంటను చూస్తే ముచ్చటేస్తోందని చెప్పారు. టీడీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం సరైన విధానాన్ని రూపొందించాలని జస్టిస్ సూచించారు.
News October 7, 2025
HYD: రిజర్వేషన్లను అడ్డుకొని బీసీల పొట్ట కొట్టొద్దు: వీహెచ్

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. సుప్రీంకోర్టు పిటిషన్‌లో తాను ఇంప్లిడ్ అయినట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రిజర్వేషన్లు అడ్డుకొని బీసీల పొట్ట కొట్టొద్దన్నారు.
News October 6, 2025
రంగారెడ్డి: తాగి వస్తున్నాడని తండ్రిని చంపేశాడు..!

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామర్లపల్లిలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రిని చంపేశాడు. తన తండ్రి మద్యం తాగి ఇంటికి వచ్చి రోజు గొడవ చేస్తున్నాడని దీంతో కోపం వచ్చి కొట్టి చంపానని చెప్పాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.