News February 14, 2025
HYD: కుంభమేళాకు వెళ్తున్న కారుకు యాక్సిడెంట్.. వ్యక్తి దుర్మరణం

కుంభమేళాకు వెళ్తున్న HYD వాసులు ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. కొంగరకలాన్‌కు చెందిన సంపత్(25), ఉప్పుగూడకు చెందిన రమేశ్, చంద్రశేఖర్, సాయివిశాల్, శ్రీనివాస్, రజినీకాంత్ బుధవారం బయలుదేరారు. నిజామాబాద్‌లోని బాల్కొండ వద్ద లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంపత్ మృతిచెందగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 16, 2025
RR: ఫేజ్- 3లో 10 ఏకగ్రీవం, 163 గ్రామాల్లో రేపు పోలింగ్

RR జిల్లాలో 3 విడుతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా 2 విడతలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి దశలో ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఫేజ్- 3లో 163 జీపీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా..10 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 153 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 549 సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 142 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా 1,448 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. 3,949 అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
News December 15, 2025
ఎన్నికల డ్యూటీ గైర్హాజరు.. కలెక్టర్ సీరియస్

ఫేస్- 1, ఫేస్-2 ఎన్నికల్లో గైర్హాజరైన 125 మంది పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కొంత మంది పోలింగ్ సిబ్బంది విధులకు హాజరై రిజిస్టర్‌లో సంతకాలు చేసి, విధులు నిర్వహించకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మూడవ విడతలో ఎవరైనా ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఉంటే సస్పెండ్ చేస్తానని ఆయన తెలిపారు.
News December 14, 2025
చేవెళ్ల: కూతురుకు ఓటేసి.. తండ్రి మృతి

ఎన్నికల్లో పోటీచేసిన తన కూతురుకి ఓటు వేసిన ఓ తండ్రి కుప్పకూలాడు. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని 14వ వార్డులో ఓటు వేసి బయటకు వచ్చిన వృద్ధుడు సోలిపేట బుచ్చయ్య (70) చనిపోయారు. ఆలూరు పంచాయతీకి అనుబంధ గ్రామం వెంకన్నగూడ 14వ వార్డులో ఆయన కుమార్తె రాములమ్మ వార్డు సభ్యురాలుగా పోటీలో ఉంది. ఓటు వేసి వస్తుండగా వృద్ధుడు కుప్పకూలి మృతి చెందాడు. అతని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.


