News February 14, 2025
HYD: కుంభమేళాకు వెళ్తూ యాక్సిడెంట్.. వ్యక్తి దుర్మరణం

కుంభమేళాకు వెళ్తున్న HYD వాసులు ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. కొంగరకలాన్‌కు చెందిన సంపత్(25), ఉప్పుగూడకు చెందిన రమేశ్, చంద్రశేఖర్, సాయివిశాల్, శ్రీనివాస్, రజినీకాంత్ బుధవారం బయలుదేరారు. నిజామాబాద్‌లోని బాల్కొండ వద్ద లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంపత్ మృతిచెందగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 6, 2025
సురవరం ప్రతాప్‌రెడ్డి వర్సిటీలో యువకుడి ఆత్మహత్య

బాచుపల్లి PS పరిధిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో కలకలం రేగింది. పోలీసుల వివరాలిలా.. బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ కోర్సులో 3rd ఇయర్ చదువుతున్న పరశురాం అనే వ్యక్తి హాస్టల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన యూనివర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 6, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: WINES బంద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం(09-11-2025) సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం(11-11-2025) సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసేవరకు వైన్స్, పబ్బులు, రెస్టారెంట్లు బంద్ చేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 14 కౌంటింగ్ రోజు కూడా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
News November 6, 2025
HYD: సజ్జనార్ సార్.. GUN FIRED

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇవాళ గన్ ఫైర్ చేశారు. నేరస్థుల గుండెల్లో కాదులెండీ తెలంగాణ పోలీస్ అకాడమీలోని బుల్స్‌ఐపై.. అకాడమీలో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌కు సిటీ పోలీస్ బృందంతో కలిసి హాజరయ్యారు. ఫైరింగ్ రేంజ్లో ఉండటం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని, బుల్స్‌ఐని ఎయిమ్ చేయడం ఎప్పుడూ నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని సీపీ Xలో ట్వీట్ చేశారు.


