News March 28, 2025

HYD: కూతురిని హత్య చేసిన తల్లి

image

కూతురిని తల్లి హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన ముదులై మణి, ఆరోగ్య విజ్జి దంపతులు. భర్త మణికి 2 మూత్రపిండాలు పాడవగా.. 15 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఆమె పెద్దయ్యాక పెళ్లి ఖర్చులు ఉంటాయని భావించి మంగళవారం నీళ్ల బకెట్‌లో వేయడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Similar News

News November 4, 2025

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం

image

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు షేక్‌పేట్ డివిజన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి కార్నర్‌ మీటింగ్‌కు హాజరవనున్నారు. రాత్రి 8 గంటలకు రహమత్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్‌ షోతోపాటు కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.

దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు

image

AP: దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ‘రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, టెన్త్ పాసై స్వయం ఉపాధితో జీవించే వాళ్లు, 18-45 ఏళ్లలోపు వయసు, 70% అంగవైకల్యం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులు. ఈనెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి’ అని తెలిపారు.