News September 14, 2025

HYD: కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్ట్

image

ప్లాట్ల అమ్మకం ముసుగులో చీటింగ్ చేసి పరారీలో ఉన్న కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీని LBనగర్ SOT బృందం, LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రదేశాల్లో ప్లాట్లను అమ్మే ముసుగులో భారీగా డబ్బు కాజేసి చాలా మందిని మోసం చేసిన ఆదిభట్లకు చెందిన శ్రీకాంత్(35)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడిపై సరూర్‌నగర్, వనస్థలిపురం, మేడిపల్లిలో కేసులు ఉన్నాయని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.

Similar News

News September 14, 2025

లిబర్టీ వద్ద మాజీ సీఎం బూర్గులకు నివాళులు

image

బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా లిబర్టీ క్రాస్ రోడ్‌లోని ఆయన విగ్రహానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలువేసి నివాళులర్పించారు. బూర్గుల సీఎం చెరగని ముద్ర వేశారని, భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిదాయక నేతగా నిలిచారన్నారు. ఆయన దూర దృష్టి ఇప్పటికి మనందరికీ ఆదర్శమని కీర్తించారు.

News September 14, 2025

నెక్లెస్ రోడ్డుకు ఆ పేరు ఏలా వచ్చిందో తెలుసా?

image

HYDలో ప్రసిద్ధ హుస్సేన్‌సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న నెక్లెస్ రోడ్, పర్యాటకుల వినోదానికి అద్భుతమైన ప్రదేశం. రోడ్డును పై నుంచి చూసినప్పుడు, సరస్సును చుట్టి ఉన్న ఆభరణం ఆకారంలో కనిపించడమే ‘నెక్లెస్ రోడ్’ అనటానికి కారణం అయింది. ముత్యాలహారంలాగా సరస్సును చుట్టుకోవడంతో ఈ పేరు వచ్చింది. సంజీవయ్య పార్క్‌ నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్ మీదుగా ట్యాంక్‌బండ్‌తో కలుస్తుంది.

News September 14, 2025

HYD: పొలిటికల్ డ్రామా.. ఓవర్ టూ అసెంబ్లీ

image

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన MLAల భవిత నేడు కీలక మలుపు తీసుకోనుంది. ‘పార్టీ మార్పు’పై ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్‌కు తమ అభిప్రాయం చెప్పబోతున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ కార్యదర్శితో BRS నాయకులు సమావేశం కానున్నారు. వారిచ్చే రియాక్షన్‌ను బట్టి స్పీకర్ చర్యలు తీసుకోబోతున్నారు. ఈ తాజా రాజకీయ పరిణామాలతో నగరంలో పోలిటికల్ హీట్ మొదలైంది.