News August 31, 2025
HYD: కృష్ణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ లైన్ మరమ్మతులు

HYD నగరానికి నీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఫేజ్-3 పంపింగ్ మెయిన్‌లో 1400 MM డయా పైప్‌లైన్‌పై, రాజేంద్రనగర్ PVNR ఎక్స్‌ప్రెస్‌వే వద్ద భారీ నీటి లీకేజీ నివారణకు మరమ్మతులు చేపడుతున్నారు. అలాగే.. అత్తాపూర్ మూసీ వంతెన వద్ద 300 MM డయా స్కేవర్ వాల్వ్ ఎక్స్‌టెన్షన్ పైప్‌లో లీకేజీ పనులు నిర్వహిస్తున్నట్లు జలమండలి పేర్కొంది.
Similar News
News September 3, 2025
కరపలో దారుణం.. తండ్రిని హత్య చేసిన కొడుకు

కరప పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పలంక మొండి గ్రామంలో దారుణ ఘటన చోటుచోసుకుంది. కే. సూర్యచంద్ర (50)ను అతని కుమారుడు చంద్రశేఖర్ బుధవారం తెల్లవారుజామున హత్య చేశాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సునీత బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News September 3, 2025
ఉయ్యూరు: లైన్‌మెన్‌పై బూతు పురాణం

ఉయ్యూరు పెద్దఓగిరాల కరెంట్ సబ్-స్టేషన్ లైన్‌మెన్ నాగరాజును లైన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ బూతులు తిట్టిన ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కరివేపాకు తీసుకురమ్మని లైన్‌మెన్‌కి చెప్పారు. వేరే పని ఉండటం వల్ల తేలేకపోయానని చెప్పడంతో ఫోన్‌లో లైన్‌మెన్‌పై అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
News September 3, 2025
NGKL: కబడ్డీ.. పాలమూరు బిడ్డ ఆల్ టైం రికార్డు

ఉమ్మడి పాలమూరు జిల్లా పదర మండలనికి చెందిన బండి రమేశ్-రమాదేవిల కుమార్తె నందిని U-18 విభాగంలో ఇండియా కబడ్డీ క్యాంపుకు ఎంపికయింది. గత నెల 28 నుంచి శిక్షణ ప్రారంభమైంది. 2 సార్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. మున్ననూర్ గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న ఈమె రాష్ట్ర స్థాయి అండర్-17 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. జాతీయ స్థాయి సబ్ జూనియర్ టోర్నీలో 2 సార్లు ఎంపికయింది.