News September 20, 2025

HYD: కేబీఆర్ పార్కులో రేపు కుక్క పిల్లలను ఇస్తారు..!

image

రేపు KBR పార్కులో దేశీ పప్పీ డాగ్ అడాప్షన్ మేళా జరగనున్న నేపథ్యంలో GHMC అధికారులు కుక్క పిల్లల ప్రేమికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పార్కు వద్దకు వచ్చి దత్తత తీసుకునే అవకాశం ఉందన్నారు. అభిమానులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News September 20, 2025

నాయుడుపేటలో లారీ ఢీకొని ట్రాక్టర్ మెకానిక్ మృతి

image

నాయుడుపేటలోని ఎల్.ఏ సాగరానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ లక్ష్మణ్‌ లారీ ఢీకొని శనివారం మృతి చెందాడు. లక్ష్మణ్ నాయుడుపేటలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్ సర్వీస్ కోసం బైకుపై ఓజిలికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మూర్తిరెడ్డిపాలెం వద్ద లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట హాస్పిటల్‌కి తరలించారు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News September 20, 2025

VKB: ఆర్టీఐ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి: చంద్రశేఖర్ రెడ్డి

image

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) 2005ను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ కలెక్టరేట్‌లో పీఐఓలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టీఐ కింద వచ్చే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.

News September 20, 2025

HYD: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: భట్టి

image

రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు HYD యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మహిళలను ఆర్థిక, సామాజిక శక్తివంతీకరణ, వ్యాపార శిక్షణ ఇచ్చి, కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.