News February 1, 2025

HYD: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్

image

కేసీఆర్ రేవంత్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామని అన్నారు. ఇంకా ఫామ్ హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా ఎక్కడికి పోతాడో చూద్దామని అన్నారు. అసెంబ్లీకి వస్తే అప్పుడు మాట్లాడతామని అన్నారు.

Similar News

News February 1, 2025

HYD: TGSPDCL, TGNPDCLకు రూ.45,698 కోట్ల రాబడి

image

విద్యుత్ భారాలపై తెలంగాణ విద్యుత్ శాఖ తర్జన భర్జన పడుతుంది. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్‌కు రూ.2,400 కోట్ల భారాలను మోస్తున్న విద్యుత్ శాఖ.. ఆ మేరకు ప్రభుత్వం నుంచి నిధులను సేకరించుకోవాల్సి ఉంది. ప్రస్తుత విద్యుత్ టారీఫ్‌తో ఎస్పీడీసీఎల్ సంస్థకు రూ.36,277 కోట్ల రాబడి వస్తుండగా.. అటు ఎన్పీడీసీఎల్‌కు రూ.9,421 కోట్ల రాబడి వస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కలిపితే రూ.45,698 కోట్లు రాబడి వచ్చింది.

News February 1, 2025

HYD: దేశంలోనే రిచెస్ట్ రీజినల్ పార్టీగా బీఆర్ఎస్

image

దేశంలో రిచ్చెస్ట్ రీజినల్ పార్టీగా బీఆర్‌ఎస్ గుర్తింపు పొందింది. తమ బ్యాంకు ఖాతాల్లో రూ.1,449 కోట్లు ఉన్నట్లు ఆ పార్టీ ఎన్నికల కమిషన్‌కు తాజాగా నివేదించింది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రూ.120.14 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీకి రూ.1,110 కోట్లు ఉండగా.. పార్లమెంట్​ఎన్నికలు ముగిసే నాటికి రూ.1449 కోట్లకు చేరుకున్నాయి.

News February 1, 2025

HYD: గురుకులల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై TG ప్రభుత్వం కీలక నిర్ణయం

image

రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలను పాటించేందుకు ఎన్ఐఎన్ సహకారం తీసుకోనుంది. ఆహార నాణ్యతతో ప్రమాణాలతో పాటు సిబ్బంది పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ రూపొందించేందుకు ప్రభుత్వం NIN సహకారం కోరింది.