News July 7, 2024
HYD: కేసు ఉందని చెప్పి రూ.3 లక్షలు స్వాహా

ఓ విశ్రాంత ఉద్యోగికి మీ పై కేసు ఉందని బెదిరించి సైబర్ కేటుగాళ్లు రూ.3 లక్షలు దోచేసిన ఘటన HYD పటాన్‌చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. GMR ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న విశ్రాంత ODF ఉద్యోగి శ్రీనివాస్‌కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంక్ అధికారులమని చెప్పారు. సామాజిక వ్యతిరేక విషయాలను ప్రచారం చేసినందుకు మీపై చెంబూరు PSలో కేసు నమోదైందని బెదిరించి డబ్బు కొట్టేయగా అతడు PSను ఆశ్రయించాడు.
Similar News
News February 17, 2026
BREAKING: మొయినాబాద్‌లో దారుణ హత్య

మొయినాబాద్ మండల పరిధిలోని కాశింబౌళిలో రేయిన్‌బో క్రికెట్ గ్రౌండ్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ సహాయంతో కీలక ఆధారాలు సేకరించారు. మృతుడు ఎవరు? పాత కక్షల వల్ల హత్య జరిగిందా? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.
News February 17, 2026
HYD: RTC బస్సుల్లో ఆధార్ కార్డు లొల్లి..!

ఆర్టీసీ బస్సుల్లో ఒరిజినల్ ఆధార్ కార్డు అంశంపై తరచూ వివాదాలు జరుగుతున్నాయి. మహిళలు, కండక్టర్లు, టికెట్ ఇన్స్పెక్టర్లతో వాగ్వాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్టీసీ MD సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. ఆధార్ కార్డు మాత్రమే కాదు, పాన్ కార్డు, భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపించినా సరిపోతుందని గతంలో తెలిపారు.
News February 17, 2026
HYD: జేఈఈ మెయిన్స్‌లో Resonance ప్రభంజనం!

JEE మెయిన్ 2026 సెషన్-1 ఫలితాల్లో హైదరాబాద్ Resonance విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. 55 మందికి పైగా విద్యార్థులు 99 పర్సెంటైల్‌కు మించి స్కోరు చేసి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. సమృద్ధి భట్టాచార్య 99.988, రేవంత్ వంగల 99.982, సాకేత్ రెడ్డి 99.932, ఆదిత్య రెడ్డి 99.918, అన్విత రెడ్డి 99.915 అగ్రస్థానంలో నిలిచారు. క్రమశిక్షణతో కూడిన శిక్షణే ఈ విజయానికి కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.


