News December 21, 2025
HYD: కొండెక్కిన కోడి గుడ్డు ధర

సామాన్యుడి నిత్యవసర వస్తువుగా మారిన కోడి గుడ్డు ధర HYD, ఉమ్మడి రంగారెడ్డిలో కొండెక్కింది. బహిరంగ మార్కెట్లో గుడ్డు ధర రూ.8, 9 ఉండగా, హోల్ సేల్‌లో రూ.7.50 వరకు పలుకుతోంది. సాధారణంగా రూ.5- 6 పలికే గుడ్డు ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో బ్యాచిలర్లు, వర్క్ అవుట్స్ చేసేవారు లబోదిబోమంటున్నారు. ప్రస్తుత ధర పౌల్ట్రీ చరిత్రలో రికార్డు అని, ఉత్పత్తి తగ్గడమే ధర పెరగడానికి కారణమని పౌల్ట్రీ నిర్వాహకులు తెలిపారు.
Similar News
News December 22, 2025
శివ పూజకు అత్యంత శుభ సమయాలు

శివారాధనకు సోమవారం అత్యంత ప్రశస్తం. 16 సోమవారాల వ్రతం, రుద్రాభిషేకం వంటివి ఈరోజే చేయడం వల్ల విశేష ఫలితాలుంటాయి. సోమవారం రోజున ‘మాస శివరాత్రి’ లేదా ‘త్రయోదశి’ తిథి కలిసి వస్తే ఆ పూజకు మరింత శక్తి చేకూరుతుంది. శివ పూజను సాయంత్రం ప్రదోష కాలంలో చేయాలి. ప్రదోష కాలమంటే సూర్యాస్తమయ సమయం. దీనివల్ల ఈశ్వరుడి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. ఈ పవిత్ర సమయాల్లో చేసే అభిషేకంతో ఆయురారోగ్యాలను సొంతమవుతాయని నమ్మకం.
News December 22, 2025
దూడల్లో విటమిన్-A లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?

విటమిన్-A లోపం ఉన్న దూడల్లో మెడ విరుపు, ఎదుగుదల సమస్యలు, విరేచనాలు, కళ్లు ఉబ్బడం, చూపు లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. పుట్టుకతోనే దూడల్లో ఈ సమస్యలు రాకుండా ఉండటానికి పశువు చూడుతో ఉన్నప్పుడు చివరి 3 నెలలు విటమిన్-A ఇంజెక్షన్ వెటర్నరీ నిపుణుల సూచనలతో అందించాలి. ఈనిన తర్వాత దూడలకు జున్ను పాలు సమృద్ధిగా తాగించాలి. దూడ పుట్టిన తర్వాత 1, 2వ వారం 2ML చొప్పున విటమిన్-A ఇంజెక్షన్ ఇవ్వాలి.
News December 22, 2025
కొండెక్కిన కోడిగుడ్డు ధర.. కారణాలివే

సాధారణంగా రూ.5 ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు హోల్‌సేల్‌లో రూ.7.30, రిటైల్‌లో రూ.8 మార్క్ దాటేసింది. పౌల్ట్రీ చరిత్రలో ఇలాంటి ధరలెప్పుడూ చూడలేదు. చలికాలంలో గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడం ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. గతంలో రోజుకు 8కోట్లుగా ఉన్న గుడ్ల ఉత్పత్తి తగ్గడమే కాకుండా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలూ నిండుకున్నాయి. సంక్రాంతి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


