News November 1, 2025
HYD: కొత్త మంత్రి అజహరుద్దీన్ శాఖలపై ఉత్కంఠ!

కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్ శాఖల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నారు. అజహరుద్దీన్ మైనారిటీ సంక్షేమం, హోం శాఖలను పొందుతారని ఊహాగానాలు వచ్చాయి. సాధారణంగా ప్రభుత్వం ఒక రోజులోనే కొత్త మంత్రుల శాఖలను ప్రకటిస్తుంది. కాగా రేవంత్ మంత్రివర్గంలోని మంత్రులు తమ ప్రస్తుత శాఖలను కోల్పోవడానికి సిద్ధంగా లేరని సమాచారం. మరి ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారో చూడాలి. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 1, 2025
గడ్డెన్న ప్రాజెక్టు పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్త

భైంసా గడ్డెన్న ప్రాజెక్టు పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు మూడో విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకోవడం వల్ల వరద గేట్ల నుంచి ఏ క్షణమైనా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోకి పశువుల కాపరులు, రైతులు ఎవరూ వెళ్లకూడదని ఆయన సూచించారు.
News November 1, 2025
KNR: తడిసిన ధాన్యాన్ని సేకరిస్తున్నాం: కలెక్టర్

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని సేకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 785 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని గుర్తించామని, IKP, PACs ద్వారా కొనుగోలు బాయిల్డ్ రైస్ మిల్స్కు తరలించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు కొంతమంది రైతులకు సుమారుగా రూ.57 లక్షలు జమ చేశామని తెలిపారు. మిగతా రైతులకు కూడా జమ అవుతాయన్నారు.
News November 1, 2025
నల్గొండ: MGU డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

మహాత్మగాంధీ యూనివర్శిటీ డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల టైం టేబుల్‌ను అధికారులు విడుదల చేశారు. నవంబర్ 13 నుండి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


