News October 14, 2025
HYD: కొత్త మద్యం పాలసీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కొత్త మద్యం పాలసీపై సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. దరఖాస్తు ఫీజు ఎక్కువ ఉంటే దరఖాస్తు చేయొద్దని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పారు. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేశారు.
Similar News
News October 14, 2025
తార్నాక మౌలిక ఆత్మహత్య కేసులో అంబాజి అరెస్ట్

HYD తార్నాకలోని కాలేజీ విద్యార్థిని మౌలిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు అంబాజీ నాయక్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ట్రైన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అంబాజీ నాయక్ పాత ఫోన్‌లో మౌలికను వేధిస్తూ చేసిన మెసేజ్‌ల డేటా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News October 14, 2025
HYD: ‘మటన్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్’

మటన్ వినియోగంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్టూట్(చెంగిచర్ల) లెక్కల ప్రకారం దేశంలో మటన్ అత్యధికంగా ఆరగించే రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని HYD ఫుడ్ సంస్థ లుక్మి పేర్కొంది. సాధారణంగా మాంసం వినియోగం ప్రకారం ఓ వ్యక్తి ఏడాదికి 7 కేజీల మటన్ ఆరగించే అవకాశం ఉందని.. కానీ తెలంగాణలో నాలుగు రెట్లు అధికంగా 24 కేజీల మటన్ తింటున్నట్లు సంస్థ వెల్లడించింది.
News October 14, 2025
అమ్మో కోఠి ENT.. ఇకనైనా మారుతుందా..?

దశాబ్దాల చరిత్ర కలిగిన HYD కోఠి ప్రభుత్వ ENT ఆస్పత్రి ప్రస్తుతం రోగులు, వైద్య సిబ్బందికి నరకంగా మారింది. ఆస్పత్రి ఆవరణ, వార్డుల్లోకి సమీప మురుగు నీరు రావడంతో ప్రాణాలను నిలబెట్టాల్సిన చోటే అపరిశుభ్రత, తీవ్ర దుర్వాసన రాజ్యమేలుతోంది. దీంతో తెలంగాణ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్(TGMSIDC) నూతన సమీకృత భవన నిర్మాణానికి రూ. 24.38 కోట్ల టెండర్‌ను ఆహ్వానించగా 18 నెలల్లో ఆసుపత్రిని ఆధునికీకరించనుంది.