News October 14, 2025
HYD: కొత్త మద్యం పాలసీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కొత్త మద్యం పాలసీపై సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. దరఖాస్తు ఫీజు ఎక్కువ ఉంటే దరఖాస్తు చేయొద్దని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పారు. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేశారు.
Similar News
News October 14, 2025
ప్రశాంత వాతావరణంలో దీపావళి జరుపుకోండి: కలెక్టర్

దీపావళి పండుగ శాంతియుతంగా జరగాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా IAS సూచించారు. పండుగ సందర్భంగా పోలీసు, అగ్నిమాపక, విద్యుత్, ఆరోగ్య, మున్సిపల్ శాఖలతో పాటు టపాకాయల విక్రయదారులతో సమన్వయ మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రజలు భద్రతా నియమాలను పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అధికారులు పాల్గొన్నారు.
News October 14, 2025
చేనేతకు పూర్వ వైభవం తీసుకురావాలి: కలెక్టర్

జిల్లాలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని కలెక్టర్ మహేశ్ కుమార్ చేనేత జౌళి శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని 23 చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. సంఘాలకు రావలసిన బకాయిల చెల్లింపులపై కూడా దిశానిర్దేశం చేశారు.
News October 14, 2025
ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు: అదానీ

గూగుల్‌తో కలిసి దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను విశాఖలో నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ‘ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు. దేశంలోని అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, ఫైనాన్స్ తదితర రంగాలకు AI ద్వారా పరిష్కారాలు చూపే ఎకోసిస్టమ్‌ను ఈ హబ్ క్రియేట్ చేస్తుంది. AI రెవల్యూషన్‌కు తోడ్పడే ఇంజిన్‌ను నిర్మించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.