News December 25, 2024

HYD: కొలువుదీరిన జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గం

image

ఇటీవల జరిగిన JCHSL ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్‌లు జూబ్లీహిల్స్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్షుడిగా బ్రహ్మాండభేరి గోపరాజు, కార్యదర్శి ఎం.రవీంద్రబాబుతో పాటు మిగిలిన సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. కేటాయించని వారికి స్థలాలు సాధించడంతో పాటు, కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని వారు పేర్కొన్నారు.

Similar News

News December 26, 2024

HYDలో పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు

image

హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బుధవారం ఆకాశంలో మబ్బులు కమ్మేసి మేఘావృతమైంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గరిష్ఠంగా 28, కనిష్ఠంగా 19.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు పగటిపూట చలిలో మంచుతో పాటు చిరుజల్లులు కురిశాయి. ఒకేసారి వాతావరణ మార్పుతో కొంత ఆహ్లాదకరంగా కనిపించినా.. ప్రజలు చలితో గజగజ వణికిపోయారు.

News December 26, 2024

HYD బుక్ ఫెయిర్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్

image

HYD ఎన్టీఆర్ స్టేడియంలో పండుగలా కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనకు పుస్తకాభిమానులు తరలివస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు స్టాలు పరిశీలించారు. అనంతరం ఆయన రెంటాల జయదేవ రచించిన మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా మొదటి రోజుల గురించి రాసిన పరిశోధనాత్మక పుస్తకమని తెలిపారు.

News December 26, 2024

HYD: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: R.కృష్ణయ్య

image

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగాన్ని సవరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు HYD విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో రాష్ట్ర బీసీ లెక్చరర్స్ సంఘం సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు కే.సుదర్శన్ అధ్యక్షత వహించగా విఠల్ సమన్వయం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు ఉన్న మాదిరిగా బీసీలకు కూడా అట్రాసిటీ ప్రొటెక్షన్ కల్పించాలన్నారు.