News August 16, 2025
HYD: కోకాపేట్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

HYD కోకాపేట్ పరిధిలోని పోలువామి 90 విలాస్ ముందు ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రోడ్డు దాటుతున్న సమయంలో టాండాల మంజుల(44) అనే మహిళను దత్తుచంద్ర అనే వ్యక్తి బుల్లెట్ బైక్‌తో ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. మంజుల గాంట్లకుంట పరిధి కన్వాయిగూడెం తండాకు చెందిన మహిళ అనే నార్సింగి పోలీసులు తెలిపారు.
Similar News
News August 16, 2025
BIG ALERT: ఇవాళ అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని SKLM, VZM, మన్యం, అల్లూరి, VSP జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. TGలోని నిర్మల్, NZB, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, SRD, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే ASF, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, KRMR, PDPL, MHBD, WGL, VKB, MDK జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
News August 16, 2025
శ్రీశైలం ఘాట్ రూట్‌లోనూ ఫ్రీ జర్నీ

శ్రీశైలం ఘాట్ రోడ్డులోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు నంద్యాల ఆర్టీసీ ఆర్ఎం రజియా సుల్తానా తెలిపారు. తొలుత ఘాట్ రోడ్డులో అనుమతి లేదని అధికారులకు ఆదేశాలు అందాయి. ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శ్రీశైలానికి కూడా ఉచిత ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంపై Way2News ఆర్ఎంను సంప్రదించగా శ్రీశైల క్షేత్రానికి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందని తెలిపారు.
News August 16, 2025
ఉచిత ప్రయాణం.. ఈ రూట్‌లో లేదు!

అనంతపురం జిల్లాలో మహిళలకు ‘స్త్రీ శక్తి’ కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభమైంది. అయితే జిల్లా సరిహద్దున కర్ణాటకలోని బళ్లారి, చెళ్లెకెర, పావగడలకు వెళ్లే బస్సుల్లో ఉచితంగా ప్రయాణం వర్తిందచు. అలాగే తాడిపత్రి మండలంలోని ఊరుచింతలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు కూడా ఉచిత ప్రయాణం పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ఘాట్ రోడ్డు కావడంతో నిబంధనల మేరకు స్త్రీ శక్తి పథకం వర్తించదని తెలిపారు.