News March 31, 2025

HYD: కోడి పందాల స్థావరంపై దాడులు

image

కోడి పందాలు ఆడుతున్నారన్న సమాచారంతో పేట్ బషీరాబాద్ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. మున్సిపాలిటీ పరిధి దేవరయాంజాల్‌లోని బాల్ రెడ్డి తోటలోని కోడి పందాలు ఆడుతున్న స్థావరంపై సోమవారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, 2 కోడి పుంజులు, 15 కోడి కత్తులు, 7 ఫోన్లు, 3 బైకులు, 26వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News July 6, 2025

వికారాబాద్: పప్పు దినుసులు సాగును పెంచేందుకు చర్యలు

image

వికారాబాద్ జిల్లాలో పప్పు దినుసుల సాగును పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తుంది. జిల్లాలో సుమారు 4.12 మంది రైతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కంది 665 క్వింటాళ్లు, మినుములు 4.32, జొన్నలు 26.8, జీలుగ 825, జనుము 762, రాగులు 4 క్వింటాళ్ల చొప్పున విత్తనాలను పంపిణీ చేశారు.

News July 6, 2025

నిజామాబాద్: SGT సమస్యలు పరిష్కరించాలని వినతి

image

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని SGTU నాయకులు కోరారు. ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కరీంనగర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేసే టీచర్స్‌కు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు. B.Ed, D.Ed వారికి కామన్ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు కల్పించాలని SGTU అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి కోరారు.

News July 6, 2025

వికారాబాద్ జిల్లాలో పకడ్బందీగా ఉపాధి హామీ

image

వికారాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సంచాలకురాలు సృజన ఆదేశాలను అమలు చేస్తున్నారు. ఉపాధి హామీలో ఫిర్యాదులు వస్తే 15 రోజుల్లో విచారించి పరిష్కరించాలని ఆమె చెప్పారు. జిల్లాలో 1,86,179 జాబ్ కార్డులు ఉండగా.. 1,28,080 జాబ్ కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం 3,78,855 మంది కూలీలు పనిచేస్తున్నారు.