News June 3, 2024

HYD: కోడ్ ముగియగానే జీరో బిల్లుల జారీ..! 

image

HYD, ఉమ్మడి RRలో అర్హులైన విద్యుత్ వినియోగదారులకు ఈనెల 6 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే బిల్లులు జారీ చేయాలని డిస్కం నిర్ణయించింది. 200 యూనిట్లలోపు వినియోగదారులకు సున్నా బిల్లు జారీ చేయనున్నారు. మిగతా వారికి ఈనెల 1 నుంచే బిల్లింగ్ ప్రక్రియ మొదలుకాగా, పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి కోడ్ ముగియగానే సున్నా బిల్లు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

Similar News

News September 21, 2024

BREAKING: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

image

భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రూట్‌లలో భారీగా ట్రాఫిక్ జామైంది. సికింద్రాబాద్ నుంచి బేగంపేట, పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్, ప్యారడైజ్ నుంచి రాణిగంజ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. మరోవైపు భారీ వర్షం కురుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవడం బెటర్.
SHARE IT

News September 21, 2024

HYDలో RELAX అంటూ వ్యభిచారం

image

RELAX అంటూ ఆన్‌లైన్‌లో అశ్లీల ఫొటోలు పంపి HYD‌ యువకులను ఆకర్షిస్తున్న వ్యభిచార ముఠా బాగోతం వెలుగుచూసింది. నెల్లూరు వాసి వంశీకృష్ణ, HYDకు చెందిన పార్వతి కలిసి ఈ దందాకు తెరలేపారు. ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలు పెట్టి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు రేట్‌ ఫిక్స్ చేసి వ్యభిచారం నిర్వహించారు. నిఘాపెట్టిన CYB AHTUకి వీరికి చెక్ పెట్టింది. గతంలోనూ వీరు ప్రాస్టిట్యూషన్‌ కేసులో అరెస్ట్ అయ్యారు.

News September 21, 2024

HYD: ఇండోర్, లక్నోకు వెళ్లిన మేయర్, కార్పొరేటర్లు

image

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు శుక్రవారం జీహెచ్ఎంసీ స్టడీ టూర్‌కి వెళ్లారు. స్టడీ టూర్‌లో భాగంగా ఇండోర్, లక్నో ప్రాంతాలకు వెళ్లి అక్కడ పలు విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ఆయా మెట్రో నగరాల్లో కొనసాగుతున్న చేపట్టిన పలు వివిధ విధానాలను, అంశాలను పరిశీలించనున్నారు. అనంతరం వాటిని గ్రేటర్ పరిధిలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.