News August 23, 2025

HYD: క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్‌తో బ్యూటిఫుల్ క్యాంప్!

image

తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు సా.5 గంటల నుంచి ఆదివారం ఉ.10 గంటల వరకు రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో నేచర్ క్యాంప్ నిర్వహించనున్నారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, నాక్టర్నల్ వాక్, నైట్ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం ఉ.6 నుంచి 9.30 వరకు బర్డ్ వాక్ ఉంటుంది. వివరాలకు 73823 07476కు సంప్రదించండి.

Similar News

News September 12, 2025

HYD: మిలాద్ ఉన్ నబి వేడుకల్లో డీజేలు నిషేధం

image

చార్మినార్ PS పరిధిలోని సనా గార్డెన్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీపీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, ఆర్‌&బీ విభాగాల అధికారులు, సుమారు 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. డీజేలు, పటాకులు నిషేధం అని డీసీపీ స్పష్టం చేస్తూ, కార్యక్రమాలు ప్రశాంతంగా, సమయానికి ముగించాలని తెలిపారు.

News September 12, 2025

GHMC, హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

image

GHMC, హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర రూ.వంద కోట్ల విలువైన స్థలానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హౌసింగ్ సొసైటీకి ఆదేశలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

News September 12, 2025

గాంధీ ఆస్పత్రిలో బాధ్యతలు స్వీకరించిన డా.వాణి

image

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా అడిషనల్ DME ప్రొ.డా.వాణి కాసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు పని చేసిన డా.రాజకుమారి గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా డా.వాణి మాట్లాడుతూ.. గాంధీలో సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.