News September 21, 2025

HYD: క్యాప్స్‌ గోల్డ్‌లో 5వ రోజు ఐటీ సోదాలు

image

క్యాప్స్‌ గోల్డ్‌లో 5వ రోజూ ఐటీ సోదాలుజరుగుతున్నయి. సికింద్రాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్ చెయ్యగా ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. చందా శ్రీనివాస్, అభిషేక్‌ను ఐటీ అధికారులు విచారించారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో బంధువులను బినామీలుగా ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

Similar News

News September 21, 2025

HYD: రియల్ విస్తరణ.. బతు‘కమ్మే’ దిక్కు

image

బతుకమ్మ పండుగ పుష్పోత్సవ సౌందర్యాన్ని కోల్పోతుందా? HYDసహా శివారుకు రియల్ ఎస్టేట్ విస్తరించడంతో తంగేడు, గూనుగు, చామంతి, రుద్రాక్ష వంటి సంప్రదాయ పూలు దాదాపు కనపడడంలేదు. ఒకప్పుడు స్వచ్ఛమైన పూల జాతరగా వెలిగిన బతుకమ్మ, ఇప్పుడంతటా ఆకులపూదోటగా మారుతోంది. సంప్రదాయాన్ని పొగొట్టొద్దని మార్కెట్‌ నుంచి బంతిపూలు తెచ్చి ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. గుర్తుందా! నాడు పురుషులు ఈరోజున పూల కోసం ఉదయాన్నే బయలుదేరేవారు.

News September 21, 2025

అక్రమ నల్లా కనెక్షన్ పొందిన 49 మందిపై కేసు నమోదు

image

జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన 49 వ్యక్తుల మీద జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఓ&ఎం డివిజన్-4 పరిధిలో అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించారు. ఈ విషయంపై సంబంధిత యజమానులు 48 మంది మీద నాంపల్లి PSలో క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్రమ నల్లా కనెక్షను తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News September 21, 2025

HYD: అనుమానంతోనే భార్య గొంతు కోశాడు

image

కుషాయిగూడ PS పరిధిలో <<17774760>>భార్య<<>>ను భర్త గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. యాదాద్రి(D)కి చెందిన దంపతులు ముుంబైలో నివాసం ఉంటున్నారు. భార్య మంజుల ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త శంకర్ మానసికంగా వేధించేవాడు. తాళలేక ASరావునగర్‌లోని తన అక్కవద్దకు రాగా పెద్దలు శుక్రవారం సర్దిచెప్పారు. రాత్రి పడుకున్నాక కత్తితో భార్య గొంతు కోశాడు. ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. పోలీసులు శంకర్ కోసం గాలిస్తున్నారు.