News February 24, 2026
HYD: క్యాబినెట్ మీటింగ్‌లో కీలక అంశాలు

HYDలో ఎలివేటెడ్ కారిడార్ కోసం రక్షణ శాఖకు చెందిన 42 ఎకరాలు తీసుకున్న నేపథ్యంలో బదులుగా కాప్రాలో 153 ఎకరాలు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నియోపోలీస్‌లో నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పన, కోహెడలో 239 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ ఏర్పాటు కోసం మార్కెట్ కమిటీకి భూకేటాయింపు, CURE ఏరియాలో 2BHK సముదాయాల్లో ఉన్న షాప్స్ వేలం వేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Similar News
News February 24, 2026
కైకలూరు: సచివాలయ సిబ్బందిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

కైకలూరు మండలం పందిరిపల్లిగూడెంలో ఏకీకృత కుటుంబ సర్వే చేస్తున్న సచివాలయ సిబ్బందిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 21న సర్వే చేస్తుండగా.. మా వివరాలు మీకెందుకు చెప్పాలని గ్రామస్థుడు బలే సాయికుమార్ తమపై దాడిచేసినట్లు సిబ్బంది టి.సురేశ్, సీహెచ్ గోపాలకృష్ణలు ఆరోపించారు. ఈ మేరకు సాయికుమార్‌పై రూరల్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
News February 24, 2026
సంతానలేమికి ముందే హెచ్చరికలు

సంతానలేమితో బాధపడే మహిళల్లో రజస్వల నాటి నుంచే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తుంటాయంటున్నారు నిపుణులు. నెలసరి సక్రమంగా రాకపోవడం, ఎక్కువరోజులు బ్లీడింగ్ కావడం, కొందరు 18 ఏళ్లు వచ్చినా అసలు రజస్వలే కాకపోవడం వంటివి గమనించాలి. ఊబకాయం, అవాంఛిత రోమాలు మొలవటం, విడవకుండా మొటిమలు వేధించటం, తీవ్రమైన కడుపునొప్పి వంటివీ ఉండొచ్చు. వీటిని రక్త పరీక్షలు, స్కానింగ్‌తో గుర్తించొచ్చు.
News February 24, 2026
₹130 కోట్ల రివార్డున్న క్రిమినల్ హతం.. ప్రియురాలే కారణం!

మెక్సికోలో రూ.130 కోట్ల రివార్డు ఉన్న డ్రగ్ కార్టెల్ బాస్ ‘ఎల్ మెంచో’ <<19213322>>హతమవడానికి<<>> పరోక్షంగా అతని ప్రియురాలు కారణమయ్యారు. ఆమెను కొన్నిరోజులుగా ట్రాక్ చేసి అతని జాడను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ‘మరుసటి రోజే డ్రగ్ డాన్ స్థావరాన్ని చుట్టుముట్టి కాల్పులు జరపడంతో అతను అడవిలోకి పారిపోయాడు. వెంటాడి అటాక్ చేయడంతో ఎల్ మెంచో, అనుచరులు గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయారు’ అని వెల్లడించారు.


