News August 26, 2025
HYD: క్రిమినల్ కావాలనే సహస్ర మర్డర్

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో విచారణ వేగం పుంజుకుంటోంది. నిందితుడైన బాలుడిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నట్టు సమాచారం. క్రిమినల్ కావాలనే లక్ష్యంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన్నట్లు దర్యాప్తులో బయటపడింది. బాలుడి ఫోన్‌లో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్‌లు అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అతడి వద్ద లభించిన లెటర్‌తో సహస్ర హత్యకు సంబంధం లేదని విచారణలో తేలింది.
Similar News
News August 26, 2025
VIJ: ఆ దుస్తులలో వస్తే దుర్గమ్మ ఆలయంలోకి నో ఎంట్రీ

ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు అభ్యంతరకర దుస్తులలో వస్తే దర్శనానికి అనుమతించకుండా నిబంధనలు అమలు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి సైతం డ్రెస్ కోడ్ తప్పనిసరిగా అమలు చేస్తామని EO శీనా నాయక్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలు వచ్చే నెల 27 నుంచి అమలులోకి తెస్తామని.. అభ్యంతరకర దుస్తులలో ఆలయానికి వచ్చి ఫోటోలు, వీడియోలు తీయగా అవి వైరలైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
News August 26, 2025
ఈనెల 29న మణుగూరు ITIలో జాబ్ మేళా

మణుగూరు ప్రభుత్వ ITIలో ఈనెల 29న జాబ్ మేళా ఉంటుందని ప్రిన్సిపాల్ జీ. రవి తెలిపారు. సింగరేణి కోల్ మైన్స్ లో పని చేస్తున్న ఎస్ఎంఎస్ కంపెనీలో టెక్నీషియన్, ఆపరేటర్స్ ట్రైనింగ్ ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఐటీఐలో ఎలక్ట్రిషన్, ఫిట్టర్, డ్రాప్స్ మెన్ సివిల్, సర్వేయర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ కోర్సులు పూర్తి చేసిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు.
News August 26, 2025
అభివృద్ధిని అడ్డుకుంటామంటే మీ ఇష్టం: RRR

AP: ప.గో. జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు. ‘భీమవరంలో కట్టకుండా ఉండి తరలిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కలెక్టరేట్ నిర్మాణానికి భీమవరంలో సరిపడా స్థలం అందుబాటులో లేదు. ఈ నిర్మాణంతో వ్యక్తిగతంగా నాకు ఏ లబ్ధి జరగదు. ఈ నిర్మాణానికి ప్రాసెస్ పూర్తయింది. దీన్ని ఆపి అభివృద్ధిని అడ్డుకుంటామంటే మీ ఇష్టం’ అని తెలిపారు.