News December 19, 2024
HYD: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్

సికింద్రాబాద్‌లోని వెస్లీ డిగ్రీ కళాశాల మైదానంలో 46వ యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి గవర్నర్ క్రిస్మస్ కానుకలను అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రార్థనలు, నృత్యం, నాటకాలతో క్రిస్మస్ వేడుకలు ఆకట్టుకున్నాయి.
Similar News
News September 19, 2025
దసరా సెలవుల వేళ.. HYD విద్యార్థులకు గుడ్‌న్యూస్

దసరా సెలవులు వచ్చాయంటే విద్యార్థులకు ఆనందమే.. ఆనందం.. సిటీలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు సొంతూరికి వెళతారు. ఈ క్రమంలో వారు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వీటిని ఏర్పాటు చేశామన్నారు. బస్సుల వివరాల కోసం 9959226148, /6142, / 6136/ 6129 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
News September 19, 2025
జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. నిమ్స్‌లో మీడియా సెంటర్

నిమ్స్ ఆస్పత్రిలో జర్నలిస్టులు, అధికారులకు వాగ్వాదాలు జరిగిన నేపథ్యంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సమాచారం కోసం వచ్చే మీడియా ప్రతినిధుల సౌకర్యార్థం మీడియా సెల్ ఏర్పాటు చేశామని ఆస్పత్రి మీడియా ఇన్‌ఛార్జి సత్యాగౌడ్ తెలిపారు. అక్కడే పార్కింగ్ సదుపాయమూ కల్పించామన్నారు. జర్నలిస్టులకు సిబ్బంది ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్న అంశాలపై యాజమాన్యం దృష్టి సారించిందన్నారు.
News September 19, 2025
HYD- నల్లగొండ.. 74 కొట్టుకుపోయిన డెడ్‌బాడీ

అఫ్జల్‌సాగర్ నాలాలో గల్లంతైన మాన్గార్ బస్తీ యువకుడు అర్జున్ (26) మృతదేహం నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద మూసీలో కనిపించింది. ఈ నెల 14న అర్జున్, రామా గల్లంతయ్యారు. 5 రోజుల తర్వాత నల్లగొండ మూసీ నదిలో డెడ్‌బాడీ ఉన్నట్లు సిబ్బంది కనుగొన్నారు. అతడి డెడ్‌బాడీ 74 కిలో మీటర్ల దూరం కొట్టుకుపోయింది. అర్జున్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.