News September 7, 2025
HYD: గంగ ఒడికి చేరిన చిట్ట చివరి గణపతి ఇదే!

ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జన వేడుకలు ఆదివారం సాయంత్రం పూర్తయ్యాయి. GHMC ఆధ్వర్యంలో ప్రత్యేక క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు తెలిపారు. ‘చివరి గణేశ్ విగ్రహ నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. ట్రాఫిక్ నిర్వహణ సజావుగా సాగేలా సహకారం అందించిన పౌరులకు కృతజ్ఞతలు’ అంటూ పోలీసులు ట్వీట్ చేశారు. గంగ ఒడికి వచ్చిన చివరి గణపతితో ఫొటోలు దిగారు.
Similar News
News September 8, 2025
నేడు CPGET-2025 ఫలితాలు

TG: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET-2025) ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి రిజల్ట్స్‌ను విడుదల చేయనున్నారు. గత నెల 6 నుంచి 11వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షకు 45,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. CPGET <
News September 8, 2025
జైల్లో లైబ్రరీ క్లర్క్‌గా ప్రజ్వల్ రేవణ్ణ

పనిమనిషిపై అత్యాచారం కేసులో హాసన్ (కర్ణాటక) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు యావజ్జీవ శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరప్పన ఆగ్రహార జైలులో ఉన్న ఆయనకు అధికారులు లైబ్రరీ క్లర్క్ పనిని కేటాయించారు. ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడం, వాటి వివరాలు నమోదు చేయడమే పని. రోజుకు ₹522 జీతంగా ఇస్తారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు నెలకు కనీసం 12, వారానికి 3 రోజులు పని చేయాలనే నిబంధన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News September 8, 2025
ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2కు శ్రీకారం

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3తో రూ.1,200 కోట్లతో ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2ను CM రేవంత్ ప్రారంభిస్తారు. GHMC, సిటీ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ORR పరిధి GPలకు నీటి సరఫరా అందించాలనేది దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా 71 రిజర్వాయర్లు నిర్మించగా.. ఇందులో కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను CM ప్రారంభించనున్నారు.