News July 3, 2024

HYD: గంటలోపు ఫిర్యాదు చేయండి: కేవీఎం.ప్రసాద్

image

మనీ లాండరింగ్, డ్రగ్స్ వచ్చాయని కాల్స్ రాగానే కంగారు పడొద్దని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టెలీకాలర్స్ డీఎస్సీ కేవీఎం.ప్రసాద్ సూచించారు. వీడియో కాల్‌లో అటు వైపు కనిపించే కేంద్ర దర్యాప్తు సంస్థల లోగోలన్నీ నకిలీవే అని, ముఖం కనిపించకుండా పోలీసు, సీబీఐ అధికారిగా మాట్లాడేది మోసగాళ్లని గ్రహించాలన్నారు. మోసపోయినట్టు గుర్తించగానే గంటలోపు(గోల్డెన్ అవర్) పోలీసులకు/1930 నంబర్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. 

Similar News

News November 14, 2025

హైదరాబాద్‌లో పెరుగుతున్న చలి తీవ్రత!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. నేడు తెల్లవారుజామున అత్యల్పంగా శేరిలింగంపల్లి HCU పరిసర ప్రాంతాల్లో 8.8C నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 10.7, BHEL 11.7, బొల్లారం, మారేడ్‌పల్లి, గచ్చిబౌలి 11.7, కుత్బుల్లాపూర్ 12.2, జీడిమెట్ల 12.7 సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News November 14, 2025

Jubilee Hills Counting: రౌండ్లు.. డివిజన్ల వివరాలు

image

రౌండ్.1: షేక్‌పేటలోని 42 బూత్‌లు
రౌండ్.2:షేక్‌పేట, ఎర్రగడ్డ, వెంగళరావునగర్-42బూత్‌లు
రౌండ్.3:ఎర్రగడ్డ, వెంగళరావునగర్, రహమత్‌నగర్-42బూత్‌లు
రౌండ్.4&5:రహమత్‌నగర్, వెంగళరావునగర్-84 బూత్‌లు
రౌండ్.6&7:వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ-84 బూత్‌లు
రౌండ్.8&9:సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ-84 బూత్‌లు
రౌండ్.10: ఎర్రగడ్డలోని 29 బూత్‌ల లెక్కింపు జరగనుంది.

News November 14, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని కౌంటింగ్‌ హాల్‌కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేరుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ సెంటర్‌లో ఉన్నారు. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరో రెండు గంటల్లోపు గెలుపు ఎవరిది? అనేది ఓ క్లారిటీ రానుందని టాక్.