News March 30, 2025

HYD: గచ్చిబౌలి, KPHBలో RAIDS

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 12 మంది సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. AHTU DCP ఆధ్వర్యంలో కూకట్‌పల్లి, KPHB, గచ్చిబౌలి PS పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళలను పట్టుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేశారు. సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసులు సూచించారు.

Similar News

News October 27, 2025

ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్: రహానే

image

టీమ్ ఇండియా సెలక్టర్లపై రహానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆటలో ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్. అనుభవమున్న, డొమెస్టిక్ క్రికెట్‌లో రాణిస్తున్న నా లాంటి ప్లేయర్లను సెలక్టర్లు కన్సిడర్ చేయాలి. కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఎక్కువ ఛాన్సులివ్వాలి. కానీ వారి నుంచి సరైన కమ్యునికేషన్ లేదు. సెలెక్ట్ చేసినా చేయకపోయినా గేమ్‌ను ఆస్వాదిస్తా. BGT 2024-25లో టీమ్‌కు నా అనుభవం పనికొచ్చేది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News October 27, 2025

ASF: నేడు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

image

ASF జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపుకు 680 మంది వ్యాపారులు దరఖాస్తులు సమర్పించారు. ఈ దరఖాస్తులపై లక్కీ డ్రా కార్యక్రమం నేడు జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ASF, కెరమెరి-గోయాగాం, WKD, తిర్యాని, గూడెం మండలాల్లో ఉన్న దుకాణాలకు తమ పేర్లు లక్కీ డ్రాలో ఎంపికైతే అదృష్టం తలుపు తట్టినట్లే అంటూ వ్యాపారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

News October 27, 2025

అక్టోబర్ 27: చరిత్రలో ఈరోజు

image

1904: స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ జననం
1914: కవి, పండితుడు బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం
1940: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ మరణం
1961: నాసా శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1984: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
1986: సినీ గేయ రచయిత కొసరాజు రాఘవయ్య మరణం