News May 7, 2024

HYD: ‘గడిచిన 24 గంటల్లో రూ.15,70,000 నగదు సీజ్’

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా HYDలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.15,70,000 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.7,57,711 విలువ గల ఇతర వస్తువులు, 127.58 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, 11 మందిపై కేసులు నమోదు చేశామని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Similar News

News October 2, 2024

BREAKING: HYD: KTRపై PSలో ఫిర్యాదు

image

మాజీ మంత్రి, ఎమ్మెల్యే KTRపై HYD వనస్థలిపురం PSలో కాంగ్రెస్ నేత, TPCC మీడియా & కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఈరోజు ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాలనకు రూ.1.50 లక్షల కోట్లు కేటాయించారని అందులో రూ.25వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ఈ ప్రణాళిక చేశారని ఇటీవల KTR ఆరోపించారు. సీఎంపై, కాంగ్రెస్ అధిష్ఠానంపై తప్పుడు ఆరోపణలు చేసిన KTRపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News October 2, 2024

HYD: చిన్ననాటి స్నేహితుడే చంపేశాడు!

image

దీప్తి శ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్‌లో సోమవారం జరిగిన హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. భర్తతో విడిపోయిన స్పందన (29) అమ్మ, తమ్ముడితో కలిసి ఉంటోంది. సోమవారం హత్యకు గురి కావడంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. చిన్ననాటి క్లాస్మేట్ బాలు హత్య చేసినట్లు గుర్తించారు. మృతురాలు భర్తతో విడిపోవడంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించగా ఒప్పుకోకపోవడంతో దాడి చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడన్నారు.

News October 2, 2024

HYD: దుర్గామాత మండపాలు.. అనుమతి తప్పనిసరి!

image

HYDలో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అప్లికేషన్ ఫారంని సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. మండపం ఎత్తు, నిమజ్జనం, నిర్వాహకుల సమాచారం అందులో పొందుపర్చాలి.
SHARE IT