News April 17, 2025
HYD: గడువు తీరిన వాహనాలతో పొల్యూషన్..!

HYD జిల్లాలో 14.8 లక్షలు, రంగారెడ్డి 4.9 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 4.7 లక్షల వరకు గడువు తీరిన ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే వీటితో HYDలో కాలుష్యం పెరుగుతోందని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఒక్కోసారి AQI 120కి పైగా నమోదవుతోందంటున్నారు. ఇటీవలే డిల్లీ కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో HYDలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News April 19, 2025
కంచన్‌బాగ్‌లో అత్యధికం.. ముషీరాబాద్‌లో అత్యల్పం

నగర వ్యాప్తంగా నిన్న సాయంత్రం కురిసిన వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. ఒక చోట ఎక్కువ వర్షం ఉంటే.. మరో చోట తక్కువ వర్షపాతం నమోదైంది. కంచన్‌బాగ్‌లో అత్యధిక వర్షపాతం 8.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ముషీరాబాద్‌లో 2.40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్‌పురలో 7.88 సెం.మీ యాకుత్‌పురలో 7.63, బేగంబజార్లో 6.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
News April 19, 2025
HYD: ఏడాదికి 2 సార్లు పీహెచ్డీ నోటిఫికేషన్..!

కూకట్‌పల్లి JNTUH యూనివర్సిటీలో ఇక నుంచి ఏటా 2 సార్లు PhD ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. అంతేకాక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థుల పర్యవేక్షణకు సూపర్వైజర్లను అందించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు JNTUH అఫిలియేటెడ్ కాలేజీల్లో IIT, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో PhD పూర్తి చేసిన వారిని సెలెక్ట్ చేయనున్నారు.
News April 19, 2025
HYD: అగ్నివీర్ దరఖాస్తులు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యువకుల నుంచి అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రబాద్‌లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు.SHARE IT