News August 26, 2025

HYD: గణనాథుడి విగ్రహాలకు రెక్కలొచ్చాయి!

image

ఈ ఏడాది గణనాథుడి విగ్రహాల ధరలకు రెక్కలొచ్చాయి. గతేడాది కంటే 20 శాతానికి పైగా ధరలు పెరిగాయి. అయినప్పటికీ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో పెద్దఅంబర్‌పేట్, నాగోల్, ఎల్బీనగర్, ఉప్పల్, మియాపూర్, ధూల్‌పేట విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. 10 ఫీట్ల విగ్రహాలు గతేడాది రూ.40-42 వేలు ఉండగా.. ఈసారి రూ.50వేలు దాటింది. విగ్రహాలకు అదనపు అలంకరణలు, హంగూ ఆర్భాటాలకు అనుగుణంగా ధరలను పెంచారు.

Similar News

News August 26, 2025

బీసీ సంక్షేమాధికారిగా విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

image

కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమాధికారిగా పి.విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇప్పటివరకు ఈ విధులను నిర్వహించిన ఇందిర భూపాలపల్లికి బదిలీ అయ్యారు. గతంలో బీసీ అభివృద్ధి అధికారిగా పనిచేసిన విజయలక్ష్మి పదోన్నతి పొంది బీసీ సంక్షేమాధికారిగా నియమితులయ్యారు.

News August 26, 2025

రేబీస్ సోకిందని పాపను చంపి తల్లి సూసైడ్

image

TG: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. యశోద(36) అనే మహిళ రేబీస్ సోకిందని తన మూడేళ్ల కూతురును చంపి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి యశోద భర్త సంచలన విషయాలు వెల్లడించారు. కుక్కలు ఎంగిలి చేసిన పల్లీలు తినడంతో పాపకు రేబీస్ సోకిందని యశోద అనుమానించిందని అన్నారు. టీకాలు వేయించినా అనుమానం పోలేదని, మతిస్తిమితం కోల్పోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే పాపను చంపి తను ఉరివేసుకుందని తెలిపారు.

News August 26, 2025

నెల్లూరు: టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికో?

image

నెల్లూరు టీడీపీ అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టుతారు, అసలు అధిష్ఠానం మనసులో ఎవరున్నారో? అని ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పదవికి రెండు సామాజిక వర్గాలు పోటీ పడుతున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం అనుభవం, విధేయత తదితర అంశాలకు లోబడి చేస్తుందా లేదా అని పార్టీ నేతల్లో సందేహం నెలకొంది. టీడీపీ అధికారంలో ఉండడంతో ఈ పదవి కీలకంగా మారుతున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఈ అంశానికి తెరపడనుంది.