News August 22, 2025
HYD: గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా? ఇవి కంపల్సరీ

గణపతి నవరాత్రుల్లో మండపాలకు నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీనుకోవాలి. https://policeportal.tspolice.gov.in/index.htmలో పర్మిషన్‌కు అప్లై చేయండి.
☞ విద్యుత్ కనెక్షన్‌కు డీడీ తీసుకోవాలి
☞ స్వతంత్రంగా కరెంట్ కనెక్షన్ ఇవ్వొద్దు
☞ నిపుణులతో గాలి, వానను తట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేసుకోండి
☞ స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోండి
☞ అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే పోలీసులకు సమచారం ఇవ్వండి.
Similar News
News August 22, 2025
HYD: వింటూనే ఉన్నాం.. ఎప్పుడు చూస్తామో!

ప్రత్యేక తెలంగాణ వచ్చి నేటికి 11ఏళ్ల 2 నెలల 20 రోజులైంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఓ పదం వింటూనే ఉన్నాం.. ‘మూసీని అభివృద్ధి చేస్తాం’ అని. ఈ పదం వినీ.. వినీ నగరవాసికి విసుగెత్తిపోయింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇపుడు కాంగ్రెస్ సర్కార్‌కు ఈ పదం పలకడం అలవాటైపోయింది. మూసీని అభివృద్ధి చేయకుండా.. చేస్తాం, చేస్తాం అని ఇంకెన్నేళ్లు చెబుతారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News August 22, 2025
HYD: ‘సరిపడా యూరియా సరఫరా చేయాలి’

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కోటి ఎకరాలకుపైగా పంటలు సాగు చేస్తున్నారని, పంటలకు సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య ఆరోపించారు. నేడు SVK వద్ద వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియా పంపించకుండా సగం యూరియానే పంపించి అదే సరిచేయాలని చెప్పడం దుర్మార్గమన్నారు.
News August 22, 2025
గ్రేటర్ వ్యాప్తంగా 7,300 గుంతల పూడ్చివేత

HYD వ్యాప్తంగా 10,110 గుంతలు వర్షాలతో ఏర్పడ్డట్లు జీహెచ్ఎంసీ ఇంజినీర్లు గుర్తించారు. మరోవైపు మ్యాన్‌హోల్ సంబంధించి 296 ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టినట్లుగా GHMC చీఫ్ ఇంజినీర్ సహదేవ రత్నాకర్ వెల్లడించారు. గత 20 రోజులలో గ్రేటర్ వ్యాప్తంగా 7,300 గుంతలను పూడ్చివేసినట్లు పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికీ పలుచోట్ల గుంతలు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.