News October 9, 2025
HYD: గతేడాది 1.31 లక్షలు.. ఈసారి 1,581

తెలంగాణలో మద్యం దుకాణాల గడువు ముగియడంతో కొత్త టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానించిన ప్రభుత్వం, ఈసారి ఊహించని స్థాయిలో తక్కువ కరవైనట్లు దరఖాస్తు చెబుతున్నాయి. గతేడాది వచ్చిన దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే ఈసారి అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయని HYDలోని ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు రాగా ఈసారి ఇప్పటివరకు కేవలం 1,581 దరఖాస్తులే అందాయి. ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
Similar News
News October 9, 2025
సైబర్ మోసాలపై HYD సైబర్ క్రైమ్ పోలీసుల సూచన

ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తో మొదలై పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. నకిలీ వెబ్‌సైట్లలో ఫేక్ లాభాలు చూపించి, ట్యాక్స్‌లు, ఫీజుల పేరుతో మరిన్ని డబ్బులు వసూలు చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. 1930, వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.
News October 9, 2025
‘మేము రాము భర్కత్‌పురా PF ఆఫీస్‌కు’

భర్కత్‌పురా PF ఆఫీస్‌లో అర్జీదారుల కష్టాలు వర్ణణాతీతం. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు, స్థానికులు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని, మరోసారి మేము రాము భర్కత్‌పుర PF ఆఫీస్‌కు అంటున్నారు. స్లిప్‌లు, సెక్షన్ మార్పులతో రోజంతా తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. ఒకేసారి వివరాలు చెప్పే PROని నియమించాలని కోరుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేవని, ఓపిక లేక బయటవచ్చి కూర్చున్నామని చెబుతున్నారు.
News October 9, 2025
పల్స్ పోలియోని విజయవంతం చేయండి: HYD కలెక్టర్

నిండు ప్రాణానికి – రెండు చుక్కలని పోలియో రహిత సమాజమే మన ముందున్న లక్ష్యమని కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మాట్లాడారు. ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించే పల్స్ పోలియో నిర్వహణ కార్యక్రమంపై జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పల్స్ పోలియో కార్యక్రమం భారతదేశంలో, పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి 1995లో ప్రారంభించామన్నారు.