News January 31, 2025
HYD: గద్దర్‌కు ముఖ్యమంత్రి నివాళి

ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతోపాటు ఆయన పేరుతో అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించింది. తన కలం, గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని, సమాజంలో అసమానతలు వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు.
Similar News
News September 16, 2025
నడిగడ్డలో మట్టిలో కలుస్తున్న మానవ సంబంధాలు

నడిగడ్డలో మానవ సంబంధాలు మట్టిలో కలుస్తున్నాయి. భర్తలను టార్గెట్ చేసి భార్యలు హతమారుస్తున్నారు. 3 నెలల క్రితం గద్వాలకు చెందిన తేజేశ్వర్‌ను అతడి భార్య ఐశ్వర్య పెళ్లైనా నెలకే కిరాతకంగా హత్య చేయించింది. ఆ సంఘటన మరువకముందే మల్దకల్ మండలం మల్లెందొడ్డిలో పద్మ తన భర్త వెంకటేష్‌పై వేడి నూనె పోసి చావుకు కారణమైంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్లేషకులు అంటున్నారు.
News September 16, 2025
MBNR: ఇంజినీరింగ్ కాలేజ్ HoDగా డా.రామరాజు

పాలమూరు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ HoDగా డాక్టర్ పండుగ రామరాజు నియామకమయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ ఉపకులపతి(VC) ప్రొ.జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు డాక్టర్ పండుగ రామరాజుకు నియమక పత్రం అందజేశారు. డాక్టర్ పండుగ రామరాజు ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ, బిట్స్ పిలానీలో పీహెచ్డీ, ఐఐటి మద్రాస్‌లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు. డా.ఎన్.చంద్ర కిరణ్ పాల్గొన్నారు.
News September 16, 2025
నేరస్థుల శిక్షల శాతం పెంచాలి: ఎస్పీ

వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించి ప్రతి కేసును పారదర్శకంగా లోతైన విచారణతో ముందుకు తీసుకెళ్లాలని, తద్వారా నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పెంచాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నెలవారి నేరసమీక్ష సమావేశంలో ఎస్పీ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో తదితర కేసుల విషయంలో అధికారులకు ఎస్పీ పలు సూచనలు సలహాలను అందించారు.