News October 8, 2025
HYD: గవర్నర్‌కు మల్లారెడ్డి ఆహ్వానం

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఈనెల అక్టోబర్ 15వ తేదీన మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గూగుల్ డిజిటల్ క్యాంపస్ 3.0 సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.
Similar News
News October 8, 2025
పాకిస్థాన్ ఘోర ఓటమి

WWCలో భాగంగా AUSతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 107 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత AUS 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. సిద్రా అమీన్(35) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ఆసీస్ బౌలర్లలో గార్త్ 3 వికెట్లతో రాణించారు. WWCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ పాక్ ఓడింది. దీంతో పాయింట్ల టేబుల్‌లో చివర నిలిచింది.
News October 8, 2025
పెనమలూరు: భర్త మందులు తీసుకురాలేదని ఆత్మహత్య

కానూరులో నివాసం ఉంటున్న మధులత 5ఏళ్ల నుంచి సోరియాసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. భర్త నాగేశ్వరరావుకు మందులు తీసుకురమ్మని వాట్సాప్‌లో చీటీ పెట్టగా.. అందులో అండర్ లైన్ చేసిన మందు మాత్రమే భర్త తీసుకువచ్చాడు. అన్ని మందులు తేకుండా ఒక ముందు మాత్రమే తెచ్చాడని భర్తను ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్థాపానికి గురైన మధులత ఇవాళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 8, 2025
కాంగ్రెస్ హామీలు ఎన్నికల డ్రామానే: శ్రీనివాస్ గౌడ్

కామారెడ్డిలో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, హడావుడిగా రిజర్వేషన్లు ప్రకటించడం కేవలం ఎన్నికల డ్రామా తప్ప మరొకటి లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. 22 నెలలుగా మాట్లాడకుండా ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. బీహార్, మహారాష్ట్ర ఎన్నికల కోసమే ఈ చర్యలని ఎద్దేవా చేశారు.