News October 3, 2024
HYD: గుడ్డిగా నమ్మితే నట్టేట మునుగుతారు.. జాగ్రత్త!

‘కర్ణుడి చావుకు సవాలక్ష’ కారణాలు అన్నట్టు HYDలో సైబర్ నేరాలతో రూ.కోట్లు మోసపోతున్న పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. అధిక వడ్డీతో ఆశ చూపటం, ట్రేడింగ్, కస్టమర్ కాల్ సెంటర్, హెల్ప్ లైన్ పేరిట, హై ప్యాకేజీ జాబ్, OTP మోసాలు, ఫేక్ లింకులు, ఫేక్ కాల్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్, ఉచిత విదేశీ ప్రయాణాలు, మ్యాట్రిమోనీ పేరిట మాయ మాటలు చెప్పి నట్టేట ముంచి రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. జర జాగ్రత్త!
Similar News
News February 21, 2026
బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) ప్రతిమా సింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన ప్రతిమాసింగ్ ప్రసూతి సెలవులపై వెళ్లారు. ప్రసూతి సెలవులు ముగియడంతో ఆమె శనివారం తిరిగి అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు అదనపు కలెక్టర్‌ను కలిసి బొకే సమర్పించారు.
News February 21, 2026
RR: సోమవారం నుంచి యథావిధిగా ‘ప్రజావాణి’

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 (సోమవారం) నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజవాణి యథావిధిగా కొనసాగుతుందన్నారు.
News February 21, 2026
HYD: 5 ఓట్లు ఉంటే రూ.లక్ష..!

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఓట్ల కోసం సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బరిలో నిలిచిన వారు ఒకరిని మించి ఒకరు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం. కొన్నిచోట్ల ఐదు ఓట్లు ఉన్న ఇంటికి లక్షల్లో డబ్బులు అందినట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులు ఉన్న వార్డుల్లో రూ.10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు చర్చ నడుస్తోంది.


