News March 19, 2025
HYD గురించి చెప్పాలనుకుంటున్నారా?

స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే మొదలైంది. దేశంలోని వివిధ నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అవార్డులు అందజేస్తోంది. ఈ సర్వేలో ప్రజలు పాల్గొని తమ నగరం గురించి అభిప్రాయాలు చెప్పవచ్చు. https ://sbmurban.org/feedback వెబ్‌సైట్ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. సర్వేలో పాల్గొనేందుకు ఈనెల 31 వరకు మాత్రమే అవకాశం. ఇప్పటికే దాదాపు 14వేల మంది నగరవాసులు సర్వేలో పాల్గొన్నారు. మరి ఇంకెందుకాలస్యం.. మీరు కూడా పాల్గొనండి.
Similar News
News February 26, 2026
నాగోల్ – శంషాబాద్ రూట్ మార్పు ‘ఫార్మా’ ప్రయోజనాలు..?

మెట్రో ఫేజ్-2 అలైన్‌మెంట్ అకస్మాత్తుగా మారడం వెనుక సాంకేతిక కారణాల కంటే ఆర్థిక కారణాలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రతిపాదించిన నాగోల్-చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లిరూట్, భవిష్యత్తులో అభివృద్ధి చేయాలనుకుంటున్న ‘ఫార్మా విలేజ్’ కనెక్టివిటీకి అనుసంధానంగా ఉండబోతోంది. ఈ రూట్‌లో భూములు కొన్న బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలే లక్ష్యంగా అలైన్‌మెంట్ ఖరారు చేసినట్లు సమాచారం.
News February 26, 2026
తొమ్మిది మందిలో ఒకరికి షుగర్ వ్యాధి: వైద్యులు

ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి షుగర్ ఉన్నా సగం మందికి ఆ విషయమే తెలియట్లేదని వైద్యులు చెబుతున్నారు. చక్కెర వల్లే షుగర్ వ్యాధి వస్తుందనుకోవడం అపోహ అని, వ్యాయామం చేయకపోవడంతో పాటు వంశపారంపర్య కారణాలు కూడా ఉంటాయని తెలిపారు. సన్నగా ఉన్నా, చిన్న వయసు వారైనా పరీక్షలు చేయించుకోవాలని.. బెల్లం, తేనె వాడినా షుగర్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఆహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.
News February 26, 2026
HYD: మెట్రో ఫేజ్-2 అలైన్‌మెంట్ వెనుక ‘రియల్’ రాజకీయం?

మెట్రో ఫేజ్-2 విస్తరణ ఇప్పుడు ‘రియల్’ పాలిటిక్స్‌కు కేంద్రంగా మారింది. రాయదుర్గం ఎయిర్‌పోర్ట్ లైన్‌ను కాదని, నాగోల్-ఎల్బీనగర్ వైపు మళ్లించడం వెనుక వేల ఎకరాల భూసమీకరణపై చర్చలు జోరందుకున్నాయి. పాతబస్తీలో నిర్మాణ వ్యయం 25% పెరగడం ప్రభుత్వానికి భారం కానుంది. మరోవైపు కేంద్రం నిధులపై కొర్రీలు వేయడం, L&T బాధ్యతల మార్పులో న్యాయపరమైన చిక్కులు ప్రాజెక్టును ఉత్కంఠలో పడేశాయి.


